కృష్ణ

రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్న టిడిపి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 26: అధికార తెలుగుదేశం పార్టీ పాలన రౌడీ రాజ్యాన్ని తలపిస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీ ఆరోపించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ధనేకుల మాట్లాడుతూ అధికారుల పట్ల ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజాన్ని తలవంచుకునేలా ఉందన్నారు. ఇటీవల విజయవాడ ఆర్‌టిఓ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు వ్యవహరించిన తీరు రౌడీ రాజ్యాన్ని తలపించిందన్నారు. సీనియర్ ఐపిఎస్ అధికారులపై దురుసుగా ప్రవర్తించటంతో పాటు అతని అంగరక్షకుడిపై చెయ్యి చేసుకోవడం వారి అధికార దాహాన్ని తెలియజేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న టిడిపి ప్రజా ప్రతినిధుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు స్పందించకపోవడం గర్హణీయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అబ్దుల్ మతీన్, రామిశెట్టి ప్రసాద్, కె చంద్రశేఖర్, యండి దాదా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

గృహాల మధ్య మద్యం దుకాణాలు వద్దు
కూచిపూడి, మార్చి 26: గృహాల మధ్య మద్యం దుకాణాలకు అనుమతించవద్దంటూ చల్లపల్లి మండలం తాగోలు గ్రామానికి చెందిన మహిళలు ఆదివారం మొవ్వ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టుముట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాల మేరకు మొవ్వ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని చల్లపల్లి మండలంలో తొలగించిన రెండు మద్యం దుకాణాల దారులు ఆ మండలంలోని తాగోలు, శ్రీనగర్, బిసి కాలనీ పరిసరాల్లో దుకాణాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు, గ్రామస్థులు 50 మందికి పైగా మొవ్వ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. అనంతరం సిఐ సూర్యప్రకాష్‌రావుకు వినతిపత్రం అందజేశారు.

బందరులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 26: కోస్తా తీర ప్రాంత మండలాలకు అతి చేరువలో ఉన్న జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని విజయకృష్ణా కోస్తా జాతీయ రహదారి జనజాగృతి సంస్థ ప్రతినిథులు ఆదివారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను కోరారు. ఈ మేరకు మంత్రి రవీంద్రకు వినతిపత్రం అందజేశారు. 25 తీర ప్రాంత మండలాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనిపై స్పందించిన మంత్రి రవీంద్ర జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో సికినం కాళిదాసు, ఆదినారాయణ, అమరనాధ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.