కృష్ణ

జాతీయ స్థాయి క్రీడగా బాల్ బ్యాడ్మింటన్ గుర్తింపునకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 26: జాతీయ స్థాయి క్రీడల్లో బాల్ బ్యాడ్మింటన్‌ను చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఆలిండియా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి రవీంద్ర విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతానికి భిన్నంగా మచిలీపట్నంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా అంతర్ వర్సిటీ ఆర్చరి పోటీలు నిర్వహించి బందరు కీర్తిని ఇనుమడింప చేశారన్నారు. భవిష్యత్తులో మచిలీపట్నంను స్పోర్ట్స్ సిటీగా మార్చేందుకు 22 ఎకరాల్లో స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నీలు మచిలీపట్నంలో జరిగేందుకు కృషి చేస్తామన్నారు. తమ గురువు దేశపతి మాస్టారు మచిలీపట్నంలో బాల్ బ్యాడ్మింటన్‌కు మంచి గుర్తింపు తెచ్చారన్నారు. గతంలో నిర్మలా హైస్కూల్ టీమ్‌ను జాతీయ స్థాయిలో నిలబెట్టారన్నారు. ఈ సందర్భంగా దేశపతి మాష్టారు బాల్ బ్యాడ్మింటన్‌ను జాతీయ స్థాయి క్రీడల్లో చేర్చాలని మంత్రిని కోరగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టోర్నీ ప్రధాన స్పాన్సర్స్ ఉమాదేవి, నాగిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శ్రీనివాస్, కోచ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.