కృష్ణ

సంక్షేమం ఘనత చంద్రబాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, మార్చి 28: తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని రాష్ట్ర పంచాయితీ రాజ్‌శాఖమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మంగళవారం ఎంపి కేశినేని నాని ఆదర్శగ్రామమైన గొల్లమందల, గొల్లమందల తండాలో 5కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జీ నల్లగట్ల స్వామిదాసు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 13వేల పంచాయతీలు ఉన్నప్పటికీ ఎంపి కేశినేని నాని తన నియోజకవర్గ పరిధిలోని 265 గ్రామాలను గ్రామాలను దత్తత తీసుకుని వాటిలో గొల్లమందల గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. తాను 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో పనిచేస్తున్నానని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎంపిని కేశినేని నానినే చూశానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒకరికీ అరోగ్యం ముఖ్యమని ఆలోచించి టాటాట్రస్టు ద్వారా అందరికీ హెల్త్‌కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. 1.40వేల మందికి కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించిన ఘనత ఎంపికే దక్కిందన్నారు. నాడు ఎన్టీఆర్ ఆడపడుచుల ద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుందని, నేడు దానిని ఆదర్శంగా తీసుకుని డ్వాక్రాగ్రూపులకు, రైతాంగానికి 90 శాతం రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. 80 శాతం గొల్లమందల గ్రామంలో సిమెంట్ రోడ్లు పూర్తయినట్లు 20 శాతం పూర్తయ్యేందుకు తన శాఖ ద్వారా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.నేడు అసెంబ్లీలో ఫ్రజా సమస్యలు విస్మరించి కేవలం గొడవలకే ప్రాధాన్యత ఇస్తు అభివృద్ధి నిరోధక శక్తిగా మారారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మంచి విజ్ఞత గల ప్రజాప్రతినిధులను ఎన్నుకుని అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచినప్పటికి ఇప్పటివరకు జరగని అభివృద్ధి కేవలం చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనే గొల్లమందల గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ చలమలశెట్టి రామానుజం, తిరువూరు ఎఎంసి చైర్మన్ టి రామారావు, డిఎల్‌పిఓ బాలయోగి, ఆర్‌డబ్యుఎస్ ఇఇ సాయినాథ్, డిఇ భాస్కరరావు, ఎంపిడిఓ నాంచారరావు, టాటాట్రస్టు ఎపి చైర్మన్ పవిత్రకుమార్, సర్పంచ్ వంగలపాటి రమాదేవి, మండల దేశం పార్టీ అధ్యక్షుడు అలవాల రమేష్‌రెడ్డి, ఎంపిపి వాసం మునీయ్య , వివిధ శాఖలకు చెందిన అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.