కృష్ణ

గుడివాడ మున్సిపాలిటీలో రూ.50 లక్షల కుంభకోణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఏప్రిల్ 4: గుడివాడ మున్సిపాలిటీలో రూ.50లక్షల కుంభకోణం వెలుగు చూసింది. సాక్షాత్తూ టిడిపి నాయకులు ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేయడంతో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వి జిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత మార్చి 21న టిడిపి నేత, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ స్వయంగా తన లెటర్‌హెడ్‌పై కుంభకోణం జరిగిందంటూ విజయవాడలోని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించక పోవడంతో సాక్షాత్తూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి దేవినేని విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేయడంతో యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. సేకరించిన వివరాల ప్రకారం ఇటీవల గుడివాడ పురపాలక సంఘానికి ఎస్సీ ఏరియాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్‌ను కలిపేందుకు ప్రభుత్వం 50లక్షల నిధులను కేటాయించింది. అయితే ఈ నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాలని, లేకుంటే అవి వెనక్కి వెళ్ళిపోతాయని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుండి ఉత్తర్వులు ఉన్నాయి. కాగా ఈ రూ.50లక్షల నిధులను ఏకమొత్తంగా ఖర్చు చేయకుండా రూ.5లక్షల చొప్పున విడగొట్టి 10 పనులుగా చేపట్టేందుకు మున్సిపల్ చైర్మన్ ముందస్తు ఉత్తర్వులను జారీ చేశారు. దాదాపు 10పాఠశాలల్లో వెయ్యి బల్లలు, బెంచీలను సరఫరా చేసేందుకు పనులను అప్పగించేశారు. గత నెల 21వ తేదీకి ముందే పనులు పూర్తయినట్టుగా అధికారులు బిల్లులు పెట్టడంతో విజయవాడలోని పబ్లిక్ అకౌంట్స్ ఆఫీస్ రూ.50 లక్షల మొత్తాన్ని ఆయా కాంట్రాక్టర్లకు చెల్లించింది. అప్పటికి ఏ ఒక్క పాఠశాలకూ ఒక్క బల్లగాని, బెంచీ గాని చేరకపోవడంతో టిడిపి నాయకులు రంగంలోకి దిగి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. కేవలం వౌఖిక ఆదేశాలతో రూ.50లక్షల నిధులను ఖర్చు చేయడం, ఎస్సీ ఏరియాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఫిలప్ చేయాల్సి ఉండగా స్కూల్స్‌కు నిధులన్నింటినీ కేటాయించడం, నిధులను 10్భగాలుగా విభజించి ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు అప్పగించడం, స్కూల్స్ పరిధిలోని జన్మభూమి కమిటీ సభ్యులు అనుమతి తీసుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు స్థానిక 20వ వార్డులోని ఒక పాఠశాలను తనిఖీ చేశారు. ఆ పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నారు. కేవలం 15 బల్లలను కొద్దిరోజుల కిందట పాఠశాలకు అప్పగించారు. అయితే రికార్డుల ప్రకారం 100 బల్లలను పాఠశాలకు ఇవ్వాల్సి ఉండగా, అన్ని బల్లలు కన్పించక పోవడంతో విజిలెన్స్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంబంధిత హెచ్‌ఎం నుండి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో స్టాక్ రిజిష్టర్‌లను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయలేకపోయారు. దీనిపై మున్సిపల్ ఇంజనీర్ చౌదరిని వివరణ కోరగా తాను అందుబాటులో లేనని, 20వ వార్డులో స్కూల్‌కు 15 బెంచీలు ఇచ్చామని, మిగతా 85 బెంచీలను స్థలంలేక సమీపంలోని స్కూల్‌కు పంపామన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాత్రం విజిలెన్స్ అధికారులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన సమయంలో తాను కూడా అందుబాటులో లేనని, స్కూల్స్ అన్నింటికీ బల్లలు, బెంచీలను సరఫరా చేశామని చెబుతున్నారు. విజిలెన్స్ తనిఖీల్లో 20వ వార్డు స్కూల్‌కు 15 బెంచీలు మాత్రమే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చామని చెప్పారు.

కృతజ్ఞతలు

మచిలీపట్నం, ఏప్రిల్ 4: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆరు శాఖలు కేటాయించినందుకు మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సిఎం చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్ధవంతమైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. న్యాయ, యువజన, క్రీడా, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంపవర్‌మెంట్ బెనిఫిట్స్, ఎన్‌ఆర్‌ఐ ఎంపవర్‌మెంట్ అండ్ రిలేషన్స్ శాఖలకు న్యాయం చేస్తానన్నారు. మంత్రి రవీంద్రతో పాటు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కూడా సిఎం చంద్రబాబును కలిసి పురపాలక సంఘానికి రూ.40కోట్లు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.