కృష్ణ

మెగా లోక్ అదాలత్‌ల నిర్వహణలో మేటిగా నిలుస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 8: జాతీయ మెగా లోక్ అదాలత్‌ల నిర్వహణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనే మేటిగా నిలుస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అన్నారు. స్థానిక జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్‌ను శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన న్యాయ అవగాహనా సదస్సులో న్యాయమూర్తి లక్ష్మణరావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చక్కని పాత్ర పోషిస్తోందన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించటంతో పాటు కక్షిదారులను చైతన్యపర్చి సదరు కేసులను రాజీ మార్గాన పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రాజీ మార్గమే రాచ మార్గమన్న సుప్రీం కోర్టు నినాదాన్ని అనుసరిస్తూ లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత రెండు మూడు నెలలుగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్‌లలో అత్యధిక కేసులను పరిష్కరించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ రోజు నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో కూడా అగ్రస్థానం కృష్ణాజిల్లాకే దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విడత 9వేల పైబడి కేసును లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు గుర్తించామన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆరు బెంచ్‌లు, విజయవాడలో తొమ్మిది బెంచ్‌లతో పాటు జిల్లాలోని 13 లీగల్ సెల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్, పలు న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.