కృష్ణ

వైభవంగా శ్రీ లక్ష్మీపతిస్వామి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఏప్రిల్ 11: శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీపతి స్వామి కల్యాణోత్సవం, గరుడ, రథోత్సవాలు భక్తులను ఆనందపరవసులను గావించాయి. పంచలక్ష్మీ నారాయణ క్షేత్రమైన మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీపతి స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథ, గరుడోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం, కమల దంపతులు కంకణధారణతో స్వామివారి కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. పండితుల వేద మంత్రాలు, భక్తుల వాసుదేవనామస్మరణలు, హరినామస్మరణలు, మంగళవాయిద్యాల నేపథ్యంలో శ్రీ రాజ్యలక్ష్మి, శ్రీగోదాదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీపతి స్వామివారి కల్యాణం వైఖానస ఆగమరీతిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎదుర్కోలు కార్యక్రమం భక్తులను పరవశింపచేసింది. సతీసక్కుబాయి పౌరాణిక నాటకం ప్రేక్షకులలో భక్త్భివాన్ని పెంపొందింపజేసింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నూతన దేవేరులతో స్వామివారు గరుడ వాహనంపై గ్రామ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందుగావించారు.
అనంతరం అలంకృత తేరుపై స్వామివారు అలంకృతులైన నూతన వధూవులతో బాణ సంచా, మంగళ వాయిద్యాల మద్య రథోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ పర్యవేక్షకుడు తుర్లపాటి ఆనందసాగర్ పర్యవేక్షణలో అర్చకులు భక్తులకు తీర్ధప్రసాద వినియోగం చేశారు. శ్రీ సీతారాం గురుదేవులు భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణ చేశారు.

స్టేడియం నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

మచిలీపట్నం, ఏప్రిల్ 11: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ పరిశీలించారు. స్థానిక మూడు స్తంభాల సెంటరులో మచిలీపట్నం-విజయవాడ ప్రధాన రహదారి పక్కన 179, 180, 181 సర్వే నెంబర్లలో ఉన్న 22 ఎకరాల భూమిని ఆయన పరిశీలించారు. రెవెన్యూ అధికారులు 22 ఎకరాల భూమికి సంబంధించి బౌండరీలను కలెక్టర్‌కు చూపించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో సాయిబాబు, తహశీల్దార్ నారదముని, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.