కృష్ణ

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రక్షణ కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: మేధావులు రోడ్డున పడడం ప్రభుత్వానికి సిగ్గుచేటని, రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రక్షణ కరువవటమే దీనికి కారణమని వైకాపా మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యురాలు రోజా ధ్వజమెత్తారు. ఎపి స్పేస్ అప్లికేషన్ సెంటర్ కాంట్రాక్ట్ ఎంప్లారుూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ రెన్యువల్, జీతాల విడుదలకు చేస్తున్న రిలే నిరాహారదీక్ష గురువారం 18వ రోజుకు చేరుకుంది. శిబిరాన్ని ఉద్దేశించి రోజా మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారని ఇలాంటి చర్యలు ప్రభుత్వాభివృద్ధికి మంచిది కాదని, వీరి సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులను తొలగించి తెలుగువారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరికి న్యాయం జరిగేవరకు వీరితో కలిసి పోరాడతామన్నారు. 35మందికి కూడా న్యాయం చేయలేకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వెంటనే స్పందించి వీరిని విధుల్లో కొనసాగేలా బకాయిపడ్డ ఆరు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ 18రోజులుగా వేసవి కాలంలో మండుటెండలో దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కాని, యాజమాన్యం కానీ వీరిని పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. ఎప్పటికైనా వీరి సేవలను గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగువారిని అవమానపరుస్తూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వీరి సమస్యలకు కారణమైన సంజయగుప్త (ఐఎఫ్‌ఎస్)ను వెంటనే తొలగించాలని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలను 2,3రోజుల్లో పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంజయగుప్తకు తెలుగు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని ఒకే శాఖలో 17 సం.లు ఎలా కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరి సమస్యలు పరిష్కారమయ్యే వరకు జనసేన పార్టీ నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఎపి స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎంప్లారుూస్ అధ్యక్షుడు ఎఎం రాజు మాట్లాడుతూ దీక్ష 18వ రోజుకు చేరినప్పటికీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. అసలు ఈ సమస్యలకు కారకులైన సంజయ్‌గుప్తాపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు దీక్షను కొనసాగిస్తామన్నారు. దీక్షలో ఆర్.కనకరాజు, ఎస్.అర్జున్, వి.శిరీష తదితరులు పాల్గొన్నారు.
కమనీయం... సాయ పల్లకీ ఉత్సవం
మైలవరం, ఏప్రిల్ 20: స్థానిక ద్వారాకామాయి నగర్‌లో వేంచేసియున్న శ్రీ షిరిడీ సాయి బాబా మందిర 23వ వార్షిక మహోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన బాబా వారి పల్లకీ ఉత్సవం కమనీయంగా, కనుల పండువగా సాగింది. దాదాపు 30 గ్రామాలనుండి తరలి వచ్చిన పల్లకీలు స్థానిక నూజివీడురోడ్‌లోని వినాయకుని గుడి నుండి ర్యాలీగా మైలవరం పుర వీధులలో మేళతాళాలతో గ్రామోత్సవం, అనంతరం పుష్పాభిషేకం జరిపారు. అంతకుముందు బాబా వారిని ప్రత్యేక అలంకరణతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రవాసాంధ్రులు, వెల్వడం ప్రముఖులు అడ్డగిరి వెంకట కృష్ణారావు, ప్రమీలాదేవి దంపతుల దాతృత్వం ఒక కోటి 25 లక్షల రూపాయలతోపాటు చండ్రగూడెం గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు కొప్పు సత్యనారాయణ, జయశ్రీ ల దాతృత్వంతో అత్యంత సుందరంగా నిర్మించిన ద్వారకామాయి ఆశ్రమ అన్నదాన క్షేత్రాన్ని సురేష్ హవారే వేలాది మంది భక్తుల హర్షధ్వానాల మధ్య ప్రారంభించారు. ఈకార్యక్రమంలో స్థానిక సాయి బాబా భక్తసమాజం కార్యదర్శి వి బాలాజీ ప్రసాద్, అధ్యక్షులు చల్లా సాంబశివరావు, దాతలు అడ్డగిరి వెంకట కృష్ణారావు, ప్రమీలాదేవి, 13జిల్లాల నుండి విచ్చేసిన సాయి మందిరాల నిర్వాహకులు పాల్గొన్నారు. అనంతరం దాదాపు 10వేల మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది.