కృష్ణ

అపర భగీరథుడు కాటన్ దొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మే 15: అపర భగీరథుడు కాటన్ దొర జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షుడు బచ్చు వెంకట నాథ ప్రసాద్ కాటన్ దొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, ఎంపిటిసిలు రాజనాల మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తుంగల కోటేశ్వరరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మత్తి శ్రీనివాసరావు, మండలి వెంకట రామ్మోహనరావు, రేమాల అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

మాస్టర్ ప్లాన్ తయారీకి ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన ముడ

మచిలీపట్నం, మే 15: మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడ) మాస్టర్ ప్లాన్ తయారీకి సంబంధించి సోమవారం ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరిచారు. మాస్టర్ ప్లాన్ తయారీకై న్యూఢిల్లీకి చెందిన రాయల్ హాస్కానిం, లీ అసోసియేట్స్, హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వి అసోసియేట్స్, ఆహ్మదాబాద్‌కు చెందిన సాయి కన్సల్టెన్సీలు టెండర్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత నెల 27వతేదీన టెక్నికల్ బిడ్ తెరిచిన ముడ అధికారులు సోమవారం టెండరుదార్ల సమక్షంలో ఫైనాన్షియల్ బిడ్‌ను తెరిచారు. టెండరుదార్లు కోడ్ చేసిన మొత్తంపై ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలించి టెండరు ఖరారు చేస్తుందని ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. మంగళవారం టెండరు ఖరారు అయ్యే అవకాశ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ అధికారి శిల్ప, డిటిసిపి ఒఎస్‌డి విద్యుల్లత, మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, రాష్ట్ర విద్య వౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఇఇ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.