కృష్ణ

చంద్రబాబుకు బాసటగా నిలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యకృషీవలుడని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం చంద్రబాబు నాయుడు 67వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనూరాధ మాట్లాడుతూ నిండు మనస్సుతో రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని కోరుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరికి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చాలాచోట్ల మంచినీటి కొరత ఏర్పడిందన్నారు. దీన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ప్రతిఒక్కరూ ఇంకుడు గుంటలు, నీటికుంటల తవ్వకాలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తు తరాలకు మంచినీరు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతిఒక్కరూ నీరు-చెట్టు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఇంకుడు గుంటల తవ్వకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసిలు లంకే నారాయణప్రసాద్, పి కృష్ణకుమారి, దాసరి కరుణజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
నవ యువకుడు చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవయువకునిలా శ్రమిస్తూ రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 67వ జన్మదిన వేడుకలను బుధవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన కేక్‌ను కట్ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆరు పదుల వయస్సులోనూ రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు తామందరికంటే చురుగ్గా చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. చంద్రబాబు సారథ్యంలో నవ్యాంప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సైతం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న చంద్రబాబుకు ప్రజలంతా అండగా నిలవాలని మంత్రి రవీంద్ర కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి పట్టణ, మండల అధ్యక్షులు ఇలియాస్ పాషా, తలారి సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

108 వాహనం ఢీకొని
వృద్ధుడి మృతి
ఆగిరిపల్లి, ఏప్రిల్ 20: 108 వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని నెక్కలం గొల్లగూడెం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల్లో కెళితే విజయవాడ నుండి ఆగిరిపల్లి వైపు వస్తున్న 108 వాహనం నెక్కలం గొల్లగూడెం వద్ద సైకిల్‌పై వెళుతున్న నల్లమోతు బసవయ్య (60) ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కుమారుడు ఏలీషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు
చందర్లపాడు, ఏప్రిల్ 20: చందర్లపాడు మండలం ఏటూరు గ్రామంలో రెండురోజుల క్రితం జరిగిన బాలిక హత్య కేసులో నిందితుడు నాగుల్‌మీరాను అరెస్టు చేసినట్లు డిఎస్పీ రాధేష్‌మురళి విలేఖరులకు తెలిపారు. ఈ హత్య కేసులో నిందితుడు నాగుల్‌మీరా ఒక్కడేనని చెప్పారు. హతురాలు శ్రావణి, నాగుల్‌మీరాకు కొంతకాలంగా పరిచయం ఉందన్నారు. ఆగస్టులో నాగుల్‌మీరాకు వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకొని ఏప్రిల్ 17న పొలం దగ్గరకి రమ్మని ఫోన్ చేయటంతో పొలం దగ్గరకి వెళ్లారని, శారీరకంగా కలిశారని తెలిపారు. అనంతరం ఇద్దరి మధ్య వివాహం విషయంలో ఘర్షణ జరగటంతో ఆవేశానికి లోనై శ్రావణిని ఉరివేసి హత్య చేశాడన్నారు. ఇంట్లో తెలియకుండా అక్రమ సంబంధాలు కొనసాగించటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయని, ప్రతిఒక్కరూ తమ పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని డిఎస్పీ సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో సిఐ సత్యకిషోర్, ఎస్సై దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

భక్తులకు కనువిందుగా ‘కూచిపూడి నృత్య సేవలు’
కూచిపూడి, ఏప్రిల్ 20: పంచ లక్ష్మీనారాయణ క్షేత్రమైన పెదముత్తేవి శ్రీ లక్ష్మీపతి స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి శేషవాహనోత్సవం కన్నులపండువగా జరిగింది. ఆలయ అనువంశీక ధర్మకర్త, ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు పర్యవేక్షణలో ముత్తీవి సత్యనారాయణాచార్యులు పౌరోహిత్యంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారికి ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. ఈసందర్భంగా స్థానిక కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ రచన, దర్శకత్వంలో కళాపీఠం విద్యార్థులు ప్రదర్శించిన నృత్య సేవలు అలరించాయి. ఇందులో భాగంగా బాలార్కకోటి ప్రతిమాక్త్రాం.. అంటూ బాలాత్రిపుర సుందరిని స్తుతిస్తూ వేదాంతం వాగ్దేవి ప్రసాద్ నృత్యాన్ని ప్రదర్శించారు. దయానంద సరస్వతి రచించిన ప్రభూ విశ్వనాధం, ప్రభూ ప్రాణనాధం అంటూ శివాష్టకాన్ని మోహనరాగం, కండచాపుతాళంలో వాగ్దేవి ప్రసాద్ ప్రదర్శించారు. జయదేవుని అష్టపదిగా సంచర దరదర అంటూ రాగమాలిక రాగం, ఆదితాళంలో దేవీ భవానీ, త్యాగరాజ కీర్తనగా నగుమోము.. అంటూ మద్యమావతిరాగం, ఆదితాళంలో, అన్నమాచార్య కీర్తనగా వినరో భాగ్యము విష్ణుకథ అంటూ శుద్ధ ధన్యాసి రాగం ఆదితాళంలో దేవీ భవాని, కూచిపూడి సాంప్రదాయ నృత్యంగా తాండవ నృత్యకరి అనే వినాయకౌత్వాన్ని మోహనరాగం, ఆదితాళంలో లోహిత, అక్షయలు ప్రదర్శించారు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అనే అంశాన్ని రాగమాలిక రాగం, ఆదితాళంలో ప్రదర్శించారు. చివరిగా దుర్గ, లిఖిత, నిహారిక అఠాణా రాగం, ఆదితాళంలో ప్రదర్శించి గురుదేవుల ఆశీర్వాదాలు అందుకున్నారు.

గ్రంథాలయ సంస్థను
అభివృద్ధి పథంలో నడుపుతా
* ఛైర్మన్ ఈడ్పుగంటి
మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 20: జిల్లా గ్రంథాలయ సంస్థను అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య చెప్పారు.
స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 67వ జన్మదినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసిన వెంకట్రామయ్య మాట్లాడుతూ భవనాలు లేని గ్రంథాలయాలకు భవన నిర్మాణాలు, అవసరమైన భవనాలకు మరమ్మతులు చేయటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలను కంప్యూటరీకరించటంతో పాటు విద్యుత్ కోతలున్న సమయంలో పాఠకులకు ఇబ్బంది లేకుండా చేయడానికి సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి వై కృష్ణారావు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కింద కొత్త రహదారి నిర్మాణం
తోట్లవల్లూరు, ఏప్రిల్ 20: మండలంలోని పాములలంక వద్ద ఎస్సీ సొసైటీ, ముదిరాజుల సొసైటీ భూములకు వెళ్లేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 800 మీటర్ల నూతన రహదారి నిర్మాణ పనులు బుధవారానికి మూడోరోజుకు చేరాయి. రూ.2లక్షల వ్యయంతో 460 మందికి ఉపాధి కల్పించేలా రహదారి పనులు చేపట్టామని ఫీల్డ్ అసిస్టెంట్ పాముల శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం ఒక్కరోజే 230 మంది కూలీలు పనుల్లో పాల్గొన్నారు. మూడు రోజులుగా పనులు సాగుతున్నాయని, ఇప్పటికి 400 మంది కూలీలకు పని లభించిందని, ఇంకా రెండు రోజులు పనిచేయాల్సి ఉందన్నారు. సొసైటీ భూములకే కాకుండా పాములలంక ప్రజల శ్మశాన వాటికకు ఈ రహదారి ఉపయోగపడుతుందన్నారు. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామైఖ్య సంఘాలు ఏర్పాటు చేసిన మజ్జిగను సర్పంచ్ పాముల శ్రీనివాసరావు, సోలే నాగరాజు కూలీలకు పంపిణీ చేశారు. ఈ పనులను మేట్‌లు డి సుదర్శన్ చంద్, పాముల రవి, పులి నాగ విజయబాబు, సీహెచ్ వెంకటరమణ, పి ప్రమీలారాణి, శివరాణి పర్యవేక్షించారు.

మోటారు సైకిల్ ఫైరింజన్‌తో సత్వర నివారణ
పాతబస్తీ, ఏప్రిల్ 20: పాతబస్తీలోని అత్యంత ఇరుకు సందుల్లో, అలాగే కొండ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సత్వర నివారణ కోసం కొత్తపేట ఫైర్‌స్టేషన్ సిబ్బంది మోటారు సైకిల్ ఫైరింజన్‌ని సిద్ధం చేశారు. అసలే ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి. పైగా తాగునీరుకే కష్టకాలం. ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తొలి ప్రయత్నంగా నీరుని వినియోగించడం జరుగుతుంది. నీరు కూడా అందుబాటులోని పరిస్థితులు నెలకొంటున్నాయి. పైగా ఫైరింజన్ ప్రవేశించలేని సందుగొందులు కొండ పైభాగాన కొండల దిగువున అలాగే ఇరుకు సందులు పాతబస్తీలో వందలాదిగా ఉన్నాయి. అలాంటి చోట ఏదైనా అగ్నిప్రమాదం సంభవించితే సత్వరమే ఫైర్ సేవలు అందించి మంటలు నివారించడానికి 108 మోటార్ సైకిల్ మొబైల్ లాగా ఫైర్ సర్వీస్ మోటారు సైకిల్ మొబైల్‌ని కొత్తపేట ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉంచారు. పెట్రోలు బంకుల్లో సిలెండర్‌లు తరహాలో ఈ మోటారు సైకిల్‌కి మూడు సిలెండర్‌లు బిగించి ఉంటాయి. సమాచారం అందిన వెంటనే ముందుగా ఈ మోటారు సైకిల్ రంగంలోకి దిగుతుంది. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలాన్ని అంచనా వేసి పైపులు సిద్ధం చేసుకుంటారు. ఇరుకు సందుల్లో ప్రమాదాలు సకాలంలో నియంత్రించి ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ మోటారు సైకిల్‌తో సేవలు అందిస్తామని ఫైర్ సిబ్బంది తెలిపారు.

‘చంద్రన్న సంచార చికిత్స’ ద్వారా ఉచిత సిటీ స్కాన్ పరీక్షలు
విజయవాడ, ఏప్రిల్ 20: పేద ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలను అందించాలనే ఏకైక లక్ష్యంతో క్రస్నా డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత సిటీ స్కాన్ సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సమక్షంలో ఎన్‌ఏసి కల్యాణమండపంలో ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండి పల్లవి జైన్ మాట్లాడుతూ క్రస్నా డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో ఉచిత ఎక్స్‌రే పరీక్షలను గత జనవరి 1వ తేదీ నుండి ఏలూరులో ప్రారంభించినట్లు తెలిపారు. అయితే సేవలను విస్తృత స్థాయిలో అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరు, టెక్కలి, చీరాల, గూడూరు కమ్యూనిటీ హెల్త్‌కేర్ సెంటర్లలో ఆన్‌లైన్ ద్వారా నేడు ముఖ్యమంత్రి ప్రారంభించారని తెలిపారు. మే 20 వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదని తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, ఏరియా ఆసుపత్రుల్లోనూ ఉచితంగా సిటీ స్కాన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి 24 గంటలూ సేవలు అందించే విధంగా క్రస్నా డయాగ్నస్టిక్స్ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. సాధారణంగా సిటీ స్కాన్ తీయించుకోవాలంటే రూ. 3వేల నుండి రూ. 4వేల వరకు ఖర్చవుతుందని అటువంటిది తమ సంస్థ పూర్తి స్థాయిలో ఉచితంగా సేవలను అందించడంతోపాటు తగిన విధంగా వైద్య సేవలను కూడా అందించనుందని తెలిపారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో పిపిపి (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్) మాడ్యూల్‌లో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే జమ్ముకాశ్మీర్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉచితంగా ఎంఆర్‌ఐ సేవలను కూడా తమ సంస్థ అందిస్తుందని తెలిపారు. త్వరలో దేశ వ్యాప్తంగా మరిన్ని చోట్ల విస్తరించనున్నట్లు తెలిపారు. చంద్రన్న సంచార చికిత్స ద్వారా క్రస్న డయాగ్నస్టిక్స్ సంస్థ నుండి ఉచితంగా కంప్యూటరైజ్ టోమోగ్రపీ (సిటి), టెలీ రేడియాలజీ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. శరీరంలోని ఏ భాగంలోనైనా ఉన్న మార్పులను, అవాంఛిత పెరుగుదలను (లోపలి పరీక్షల అవసరం లేకుండా) గుర్తించే పరీక్షలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎపి ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా తూర్పుడెల్టా ప్రాజెక్టు కమిటీ కార్యాలయం ప్రారంభం
* కృష్ణా, గుంటూరులకు అందుబాటులో ఉంటుందన్న ఉమ
పాయకాపురం, ఏప్రిల్ 20: సాగునీటి వ్యవసాయంలో కేవలం సాంకేతిక నైపుణ్యం మాత్రమే చాలదని, సామాజిక పరిజ్ఞానం కూడా అవసరమని, అది నీటి వినియోగంలో అంతిమ లబ్దిదారుడైన రైతుకే ఉంటుందనే ఉద్దేశ్యంతో రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారి 1997లో ‘ఆంధ్రప్రదేశ్ రైతుల నీటి పారుదల వ్యవస్థల చట్టం’ అనే శాసనాన్ని రూపొందించిందని జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణాడెల్టా పరిధిలోని తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ కార్యాలయాన్ని నగరంలోని జలవనరుల శాఖ ఆవరణలోని నూతన భవనంలో మంత్రి ఉమ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని నీరుగారిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి 2015లో నీటి సంఘాలను పునరుద్దరించి రాష్ట్ర వ్యాప్తంగా 6138 నీటి సంఘాలను ఏర్పాటు చేసి 36000 మందికి, కృష్ణాజిల్లా వ్యప్తంగా కృష్ణా తూర్పు డెల్టా, నాగార్జున సాగర్ ఎడమ కాలువ తదితర మేజరు ప్రాజెక్టుల కింద చిన్న నీటి పారుదల మునే్నరు ప్రాజెక్టు, చెరువుల కింద మొత్తం 585 నీటి సంఘాలను ఏర్పాటు చేసి 3500 మందికి బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ వేసవిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నీరు, చెట్టు కార్యక్రమంలోవ నీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు అందరూ భాగస్వాములై చెరువుల పూడికతీత, వాగులు వంకలు లోతు చేసుకోవడం, చెక్ డ్యాంల నిర్మాణం తదితర కార్యక్రమాలను చేసి భూగర్భ జలాల కొరతను అధిగమించాలని సూచించారు. నేడు ప్రారంభించిన కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ కార్యాలయం విజయవాడ మధ్యలో అందరికీ అందుబాటులో ఉందని, దీనిని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నాలుగు ప్రాజెక్టు కమిటీల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్‌లు, నీటి సంఘాల అధ్యక్షులు ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ సమస్యలను ఇదే ప్రాంగణంలో ఉన్న జలవనరుల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నీరు - ప్రగతి అనే కార్యక్రమం ద్వారా నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో నీటి గణన చేసి జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా నీటి లభ్యత, అవసరం, లోటు, మిగులు తదితర పూర్తి వివరాలతో నీటి సంఘాలకు అందించి నీటి విలువను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగిందనీ, దానిని సద్వినియోగం చేసుకుని తమ ప్రాంతంలో భూగర్భజల పరిరక్షణకు నడ్డుంకట్టి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని నీటి సంఘాల అధ్యక్షులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాడెల్టా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ గుత్తా శివరామకృష్ణ, జలవనరుల శాఖ రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్‌లు గుండపనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇ - పంట నమోదు ప్రక్రియలో
98.92 శాతం ప్రగతి సాధించాం
* జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు
పాయకాపురం, ఏప్రిల్ 20: ఇ - పంట నమోదు ప్రక్రియలో గ్రామ రెవెన్యూ అధికారిని పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేసి, ఆ స్థాయిలో పర్యవేక్షణ చేయడం ద్వారా 98.92 శాతం మేర జిల్లాలో ప్రగతిని సాధించగలిగామని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలియజేశాడు. హైదరాబాద్ నుండి బుధవారం సిసియల్‌ఎ కమిషనర్ అనీల్‌చంద్ర పునీత్ నిర్వహించిన వీడియో కానె్ఫరెన్స్‌కు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్‌తో పాటు సబ్ కలెక్టర్ జి.సృజన, డిఆర్‌ఓ సిహెచ్.రంగయ్య, ఆర్డీవో చక్రపాణి, ఎడి మైన్స్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.