కృష్ణ

రెండు దశల్లో బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: రెండు దశల్లో బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన దుర్గగుడి ఫ్లైవోవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైవోవర్ నిర్మాణాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బెంజ్ సర్కిల్ తొలిదశకు 83కోట్ల రూపాయలు, రెండోదశకు 150కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. జ్యోతి మహల్ నుంచి నిర్మలా కానె్వంట్ జంక్షన్ వరకూ తొలిదశ, నిర్మలా కానె్వంట్ నుంచి రమేష్ ఆసుపత్రి వరకూ రెండో దశగా పనులు చేపడతామని తెలిపారు. జూలైలో బిడ్డింగ్‌ను ఆహ్వానించి 18నెలల్లో నిర్మాణం పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారుల విస్తరణలో చెట్లు తొలగించకుండా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు. దుర్గగుడి ఫ్లైవోవర్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై అధికారులతో సమీక్షించారు. నిర్మాణ సంస్థ యజమానులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ పురోగతిపై మాట్లాడుతూ న్యాయపరమైన అంశాలను పరిశీలించి సొసైటీ కింద రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ సంస్థ ఉద్యోగులకు 40శాతం మేర జీతాలు పెంచుతున్నట్లు తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం కృష్ణానదిపై చేపట్టే వంతెనల నమూనాలను అధికారులు ప్రజెంట్ చేశారు. నెమలి, కాళీయమర్ధనం, నాగలి ఆకృతుల్లో వారథుల నిర్మాణానికి నమూనాలు ఇచ్చారు. వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

అర్చకులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
మచిలీపట్నం (కల్చరల్), జూన్ 19: నిత్యం దైవచింతనలో ఉంటూ ప్రజల ఆయురారోగ్యాల కోసం భగవంతున్ని ప్రార్థించే అర్చకులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం వల్ల పలు ఇబ్బందులకు గురవుతున్నారని అర్చకుల సంఘం రాష్ట్ర నాయకుడు ఘంటసాల పద్మనాభ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట కొద్దిసేపు ధర్నా చేశారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ చంద్రుడుని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన యువజన విభాగం అధ్యక్షుడు పివి ఫణికుమార్, అర్చక సంఘం ప్రతినిధులు గోవర్ధనం, శ్రీలక్ష్మీ నరసింహాచార్యులు, బృందావనం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

మొవ్వలో చెత్త నుండి సంపద తయారీ
కూచిపూడి, జూన్ 19: మొవ్వ పంచాయతీ నిర్వహించే ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలతో సంపద తయారీ యూనిట్ జిల్లాలో 3వ స్థానం, రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచిందని ఇఓ జె రాజేంద్రప్రసాద్ తెలిపారు. సోమవారం యూనిట్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ నేటి నుండి గ్రామంలో చెత్త కనపడకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో పెదపారుపూడి, వత్సవాయి, మొవ్వ మండలాలకు చెందిన ఇఓలకు ఈనెల 21వ తేదీన చిత్తూరు జిల్లా కాళహస్తిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు అదనపు కమీషనర్ సుధాకర్ తెలియపర్చారన్నారు.