కృష్ణ

హిందూ ధర్మ పరిరక్షణకు ఆలయాలు అవస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, జూన్ 19: హిందూ ధర్మ పరిరక్షణకు దేవాలయాల నిర్మాణం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండలంలోని తలగడదీవి శివారు ఎస్టీ కాలనీలో సోమవారం శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ సమాజం ధర్మ మార్గాన పయనించేందుకు, ప్రజలు సుఖ సంతోషాలతో మెలిగేందుకు దేవాలయాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. మారుమూల గ్రామాలలో నివశిస్తున్న బడుగు వర్గాల కాలనీల్లో కూడా దేవాలయాలను నిర్మించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ ద్వారా నిధులను మంజూరు చేయటం అభినందనీయమన్నారు. మండల సమరసత సేవా ఫౌండేషన్ ప్రచారక్ పిరాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ టిటిడి సమకూర్చిన రూ.5లక్షలతో ఆలయ నిర్మాణం జరిగిందని, మండల ఆర్యవైశ్య ప్రముఖుడు చిట్టా సాంబశివరావు, చిట్టా శివ నాగేశ్వరరావు స్వామివార్ల విగ్రహాలను బహూకరించారన్నారు.

మా పాఠశాలను వీడి వేరే ప్రాంతానికి వెళ్లం
కృత్తివెన్ను, జూన్ 19: మా పాఠశాలను వదిలి వేరొక ప్రాంతానికి వెళ్లి చదువుకునేది లేదంటూ మండల పరిధిలోని రామాపురం గ్రామస్థులు, విద్యార్థులు సోమవారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. రామాపురం ఉన్నత పాఠశాలను రద్దుచేసి అక్కడ చదువుతున్న విద్యార్థులను చినపాండ్రాకకు బదిలీ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను విరమించుకోవాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ పాఠశాలలోనే మా విద్యార్థులను కొనసాగిస్తామని, వేరొక పాఠశాలకు మార్చమని ఉన్నతాధికారులకు తెలిపారు. 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తూ 70 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులతో పాఠశాల నిర్వహించటం జరుగుతుందన్నారు. అయితే జీవో నెం.29 హేతుబద్దీకరణతో ఈ స్కూల్స్ మూతపడుతున్నాయి. గ్రామస్థులు, విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు.