కృష్ణ

ప్రయోజనకరంగా బాలికలకు సైకిళ్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, జూన్ 19: బాలికలు సైతం చదువుల్లో రాణించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సైకిళ్ల పంపిణీ ఎంతో ప్రయోజనంగా ఉందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. సోమవారం మండలంలోని మల్కాపురం, గండ్రాయి గ్రామాల్లో జిల్లా పరిషత్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థినులకు ప్రభుత్వం మంజూరు చేసిన సైకిళ్లుతో పాటు పాఠ్యపుస్తకాలు అందజేసి వారిని ఉద్దేశించి మాట్లాడారు. సైకిళ్ల పంపిణీ విద్యార్థినులకు సౌకర్యంగా ఉండి, పాఠశాలలో డ్రాప్ అవుట్‌ల శాతం తగ్గడంతో పాటు పాఠశాలకు వచ్చే వారి సంఖ్య పెరగడం శుభ పరిణామమన్నారు. జగ్గయ్యపేట మండలానికి 393, వత్సవాయి మండలానికి 200, పెనుగంచిప్రోలు మండలానికి 152, నందిగామ మండలానికి 75 కలిపి మొత్తం నియోజకవర్గానికి 820 సైకిళ్లు మంజూరు అయ్యాయని తెలిపిన ఎమ్మెల్యే పథకం ప్రవేశపెట్టిన సిఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు కల్యాణం భాస్కరరావు, కనపర్తి నాగమణి, గ్రామ పార్టీ నాయకులు కనపర్తి పిచ్చయ్య, కనపర్తి ప్రసాద్, జిల్లా యువత నాయకుడు కనపర్తి వంశీకృష్ణ, పాఠశాల కమిటీ చైర్మన్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి
* జూలై 9, 23తేదీల్లో స్పెషల్ డ్రైవ్ * జాయింట్ కలెక్టర్ చంద్రుడు

మచిలీపట్నం, జూన్ 19: ఈ ఏడాది (2017) జనవరి 1వతేదీ నాటికి జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా చేర్పించాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులపై సోమవారం తన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిరంతర ఓటర్ల జాబితా నవీకరణలలో భాగంగా జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక క్యాంపైన్‌ను జూలై 9, 23తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 29లక్షల 2వేల 347 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. కళాశాల యాజమాన్యం నుండి ఒకరిని నోడల్ అధికారిగా, 200 మంది విద్యార్థులకు ఒక అంబాసిడర్‌ను నియమించాలన్నారు. ఇందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం ఎంతో అవసరమన్నారు. ఈ సమావేశంలో ముడ విసి వేణుగోపాలరెడ్డి, సిపిఐ నాయకులు అక్కినేని వనజ, ఎన్‌సిపి నాయకుడు పరుచూరి కరుణాకర్, జెడియు నాయకుడు మజ్జి జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.