కృష్ణ

సిట్ ఎంక్వైరీ కోరుతూ బాబుకు లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జూన్ 19: తనతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, టిడిపి నాయకులపై సిట్ ఎంక్వైరీ జరపాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సోమవారం లేఖ రాశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రావి మాట్లాడుతూ గుడివాడలో మున్సిపల్ రిజర్వ్ స్థలాలు, దేవాదాయ భూములు కబ్జాకు గురయ్యాయని, వీటిపై న్యాయ విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ, దేవాదాయశాఖలకు ఫిర్యాదు చేశానన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్తానన్నారు. ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరానన్నారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గోకరకొండ బలరాం, టిడిపి జిల్లా ప్రచార కార్యదర్శి అంగడాల సతీష్, సీనియర్ నేత పండ్రాజు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారిగా దేవానందరెడ్డి
* నందిగామ డివైఇఓగా చంద్రకళ

మచిలీపట్నం, జూన్ 19: జిల్లా విద్యాశాఖాధికారిగా డి దేవానందరెడ్డి నియమితులయ్యారు. విద్యాశాఖ కాకినాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌గా వున్న దేవానందరెడ్డికి జిల్లా విద్యా శాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇన్‌ఛార్జ్ విద్యా శాఖాధికారిగా వ్యవహరించిన ఎ సుబ్బారెడ్డిని టెట్ జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగాలని, ఆయన స్థానంలో గుంటూరు డివైఇఓ పిల్లి రమేష్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లా విద్యా శాఖాధికారిగా వచ్చేందుకు రమేష్ అయిష్టత చూపటంతో ఆ బాధ్యతలను ఆర్‌జెడిగా కొనసాగుతున్న దేవానందరెడ్డికి అప్పగించారు. దేవానందరెడ్డి 2012-2015 కాలంలో జిల్లా విద్యా శాఖాధికారిగా పనిచేశారు. శ్రీకాకుళం డిఇఓగా వ్యవహరిస్తున్న దేవానందరెడ్డి గత ఫిబ్రవరి నెలలో కాకినాడ ఆర్‌జెడిగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన మరుసటి రోజునే గత కొనే్నళ్లుగా జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఇఓ పోస్టులను భర్తీ చేసి జిల్లాపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా గతంలో డిఇఓగా వ్యవహరించిన ఎ సుబ్బారెడ్డి భార్య చంద్రకళను నందిగామ డివైఇఓగా నియమిస్తూ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈమెను జిల్లా పరిషత్ కార్యాలయ డివైఇఓగా బదిలీ చేయగా అందుకు ఆమె అయిష్టత చూపారు. దీంతో నందిగామ డివైఇఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ముస్లిం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
* ఉపసభాపతి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, జూన్ 19: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానిలో భాగంగానే రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 12లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫాను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. స్థానిక తాలూకా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 1355 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని బుద్ధప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సయ్యద్ ఖాదర్ భాషా, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, ఎంపిపి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు అరెస్ట్
* రూ. 2.70 లక్షలు స్వాధీనం
జగ్గయ్యపేట, జూన్ 19: పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని అదుపులోనికి తీసుకుని రూ. 2.70 లక్షల స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ డిఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆదివారం రాత్రి ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా పట్టణంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సిహెచ్ వెంకటేష్, పి రవి, బి నాగసందీప్, టి నాగరాజులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 2.70 లక్షలను, ఐదు సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరికొందరి గురించి విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ లచ్చునాయుడు, పట్టణ ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
హోల్‌సేల్ షాపులో చోరీ

రైతుల భయపెడుతున్న ఏనుగులకోడు డ్రైన్
* వేసవిలో డెక్క నిర్మూలన పట్టని అధికారులు * వర్షం కురిస్తే ముంపుతప్పదు

తోట్లవల్లూరు, జూన్ 19: మండలంలోని ఏనుగుకోడు డ్రైన్ రొయ్యూరు రైతుల గుండెల్లో హడలెత్తిస్తోంది. డ్రైన్ నిండా పెరిగిన గుర్రపుడెక్క, తూటికాడ రేపు వర్షాల వల్ల ఎగువ నుంచి వచ్చే మురుగు దిగువకు పారకుండా అడ్డుకునే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేశాక మురుగునీరు వస్తే వందల ఎకరాల్లో వరి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రైతులు భయపడుతున్నారు. రొయ్యూరు నుంచి వల్లూరుపాలెం వరకు డ్రైన్ అస్తవ్యస్తంగా ఉంది. గతేడాది పెనమకూరు నుంచి వల్లూరుపాలెం వరకు పూడికతీత చేపట్టారు. ఎగువన రొయ్యూరు వరకు డ్రైన్‌లో పూడికతీత తీయాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. వేసవిలోనే గుర్రపుడెక్క నిర్మూలన చేపడితే ప్రస్తుతం సమస్య తీవ్రత తగ్గేదంటున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ఏనుగులకోడు డ్రైన్‌లో గుర్రపుడెక్క, తూటికాడ తొలగించాలని రైతులు కోరుతున్నారు.