కృష్ణ

మా ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టవా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 19: మా ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టవా..?, గత పదేళ్లుగా బిల్లులు వచ్చినా రాకపోయినా అప్పోసొప్పో చేసి మధ్య తరగతి, పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న తమను కాదని స్వచ్చంద సంస్థల ముసుగుతో ప్రభుత్వం తమ కడుపు కొడుతోందని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గళమెత్తారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సోమవారం వందలాదిగా జిల్లా కేంద్రం మచిలీపట్నం తరలివచ్చారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట మండుటెండలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించి తమకు న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడును నిలదీశారు. ఎపి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు, సిఐటియు తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు చౌటపల్లి రవి, వై నరసింహరావు సంఘీభావం తెలిపారు. ఆవేశం మీద ఉన్న కార్మికులు కలెక్టరేట్ గేట్లు ఎక్కి నిరసన తెలిపారు. వీరిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఫలితంగా వేలాది మంది కార్మికులంతా ఒక్కసారిగా కలెక్టరేట్ గేట్లు నెట్టుకుని ‘మీకోసం’ కార్యక్రమంలో ఉన్న జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు దగ్గరకు వెళ్లారు. కలెక్టరేట్ సమావేశ మందిరం ఎదుట కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు స్పందించిన జాయింట్ కలెక్టర్ చంద్రుడు సమావేశ మందిరం నుండి బయటకు వచ్చి ఆందోళనకారుల సమస్య అడిగి తెలుసుకున్నారు. డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు పి పార్వతి, ఎన్‌సిహెచ్ సుప్రజ, వెంకటరమణ, బి జయమ్మ, జి వెంకటేశ్వరమ్మ, సిఐటియు నాయకులు బూర సుబ్రహ్మణ్యం, సిహెచ్ జయరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం: స్వరూపరాణి
స్వచ్చంద సంస్థల ముసుగులో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె స్వరూపరాణి హెచ్చరించారు. తొలుత కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ 2003వ సంవత్సరం నుండి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కార్మికులు మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా అమలుచేస్తూ వచ్చారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రీకృత వంటశాలల పేరిట విద్యార్థులకు రుచికరమైన ఆహారానికి దూరం చేస్తోందన్నారు. పలు చోట్ల ఇస్కాన్, నాంది, అక్షయపాత్ర, బుద్ధవరపు ట్రస్ట్, హరేరామ హరేకృష్ణ వంటి స్వచ్చంద సంస్థలకు ఈ పథకాన్ని ధారాదత్తం చేయాలని చూడటం గర్హనీయమన్నారు. పూర్తిగా హిందూమత సంస్థలైన ఈ సంస్థలు విద్యార్థులకు కోడిగుడ్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు.
మీ సమస్యను నా సమస్యగా స్వీకరిస్తా: జేసీ
మీ సమస్యను నా సమస్యగా స్వీకరించి తగిన న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. కలెక్టరేట్ మీటింగ్ హాలు వద్ద ఆయన ఆందోళనకారులనుద్దేశించి ప్రసంగించారు. ప్రతి డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లటంతో పాటు వాటి పరిష్కారానికి జాయింట్ కలెక్టర్‌గా తన విధులు నిర్వర్తిస్తానన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సబ్సిడీపై గ్యాస్ కనక్షన్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. సుమారు 1100 పాఠశాలలకు సబ్సిడీ ఇవ్వాల్సి ఉందని, అది కూడా వారం పది రోజుల్లో అందిస్తామని జేసీ చంద్రుడు హామీ ఇచ్చారు.