కృష్ణ

జిల్లా ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 27: మూడేళ్ల విరామం అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఈ నెల 29న జరగనుంది. గతంలో ఉన్న కమిటీ రద్దు అయిన నేపథ్యంలో నూతన కమిటీని మంగళవారం ఏర్పా టు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం చైర్మన్‌గా 12 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై వైద్యాధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి కమిటీ సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నెల 29న నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నూతన కమిటీకి వర్కింగ్ చైర్మన్‌గా టి సోమశేఖరరావు (్ఫలంత్రోపిస్ట్), మెంబర్ కన్వీనర్‌గా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్, సభ్యులుగా సామాజిక కార్యకర్తలు అంగర తులసీదాస్, అబ్దుల్ అజీమ్, డియం అండ్ హెచ్‌ఓ డాక్టర్ టివియస్‌ఎన్ శాస్ర్తీ, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జ్యోతిర్మణి, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ యం ప్రమీల, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ యం యశ్వంతరావు, ఎపియంయస్‌ఐడిసి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ప్రవీణ్ రాజ్, జిల్లా సమాఖ్య కార్యదర్శి చావా అనసూయ, ఫిలంత్రోపిస్ట్‌లు డి ఉమామహేశ్వరరావు, బి వెంకట కృష్ణంరాజు నియమితులయ్యారు.