కృష్ణ

నిర్లక్ష్యాన్ని వీడి బాధ్యతగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 27: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిండు గర్భిణులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చలించిపోయారు. గర్భిణులు పడుతున్న ఇబ్బందులు ఆమెకు కన్నీళ్లు తెప్పించాయి. మానవత్వాన్ని మరచి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు వైద్య సేవలు అందించడం ఇష్టంలేని పక్షంలో ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోండి... అంతేగానీ నిండు గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం చైర్‌పర్సన్ అనూరాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆధునాతన వైద్య సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా ప్రారంభించిన గర్భకోశ ప్రసూతి, చిన్న పిల్లల విభాగంలో అందుతున్న వైద్య సేవలపై వాకబు చేసేందుకు మంగళవారం ఆమె ఆస్పత్రిని సందర్శించారు. ఈ క్రమంలో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రి నుండి అత్యవసర వైద్య సేవల నిమిత్తం అక్కడి వైద్యుల సూచన మేరకు ఓ నిండు గర్నిణీ సోమవారం రాత్రి బందరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలు డాక్టర్ నీలిమ కేసు క్రిటికల్‌గా ఉండటంతో విజయవాడ వెళ్లాలని సూచించింది. విజయవాడ వెళ్లేందుకు అంబులెన్స్ కూడా అందుబాటులో లేదని డ్రైవర్‌తో మాట్లాడుకుని ఎంతోకొంత ఇచ్చి వెళ్లమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ గర్భిణీ ఆస్పత్రిలోనే ఉండటాన్ని గమనించిన జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధిత వైద్యురాలు నీలిమను వివరణ అడిగారు. ఎమర్జెన్సీ కేసులను అంబులెన్స్ సౌకర్యం కల్పించి విజయవాడ పంపించాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. దీనికి వైద్యురాలు సమాధానమిస్తూ ఆస్పత్రికి ఒకే ఒక్క అంబులెన్స్ ఉందని, అది కూడా నెలకు 200 లీటర్లు మాత్రమే డీజిల్ వినియోగించే అవకాశం ఉందని వైద్యురాలు చెప్పిన సమాధానానికి చైర్‌పర్సన్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయకుమార్‌ను వివరణ అడిగారు. 200 లీటర్ల డీజిల్‌కు మాత్రమే ప్రొవిజన్ ఉందని ఆయన సమాధానమిచ్చారు. 60 పడకల ఆస్పత్రికి ఉన్నప్పుడు ఉన్న ప్రొవిజన్‌ను నేడు 150 పడకల ఆస్పత్రికి మారిన తర్వాత ఎందుకు మార్పు చేయలేదని ఆమె ప్రశ్నించారు. దీనికి ప్రధాన కారణంగా క్రమంగా జరగాల్సిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలను నిర్వహించకపోవడమేనన్నారు. అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించాలని తాను పదేపదే ఆదేశిస్తున్నా మీరు మాత్రం సమావేశాలు నిర్వహిస్తున్న పాపాన పోలేదన్నారు. ఫలితంగానే ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్ర స్థాయిలో మీలాంటి అసమర్ధ అధికారుల వల్ల వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామన్నారు. ఆస్పత్రికి మరో అంబులెన్స్ కావాలన్న విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తమ దృష్టికి వస్తే జిల్లా పరిషత్ నుండి చైల్డ్ ఉమెన్ ఫండ్స్ నుండి నిధులు మంజూరు చేసేవాళ్లమన్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఒఎన్‌జిసి అధికారులు అంబులెన్స్ కొనుగోలు నిమిత్తం రూ.9.75లక్షలు ఇచ్చారని, అయితే మరో రూ.2లక్షలు కావల్సి ఉందన్నారు. ఈ నిధులను జెడ్పీ నుండి ఇచ్చేందుకు ఆమె అంగీకారం తెలిపారు. ఆమె వెంట జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఆస్పత్రి ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.