కృష్ణ

దుర్గగుడి ఇవో చర్యలపై ట్రస్ట్ బోర్డు గరం.. గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి తీసుకున్న వివిధ నిర్ణయాలపై ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద పంచాయితీ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం నూతన నిర్మాణాలను ప్రారంభించటం, ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా పనులు ప్రారంభించటం, తదితర అంశాలు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయన ముందు ఏకరువు పెట్టినట్లు తెలిసింది. సూర్యకుమారి ఇవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ పనులపై పూర్తి వివరాల నివేదిక, వాస్తుకు వ్యతిరేకంగా చేపట్టిన నిర్మాణాల నిలుపుదల, అంతరాలయ దర్శనం టిక్కెట్ ధర తగ్గింపు, తదితర అంశాలను వెంటనే పరిశీలించి స్పష్టమైన ఆదేశాలను ఇవోకు జారీ చేయాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులనుఇవో గౌరవించటం లేదన్న అంశాన్ని సైతం ఒక సభ్యుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దుర్గగుడి ట్రస్ట్ బోర్డులు సభ్యుల చెప్పిన అంశాలను ప్రిన్సిపాల్ సెక్రటరీ పూర్తిగా ఆలకించి దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు రెండ్రోజులు వేచి ఉండాలని సూచించినట్లు తెలిసింది. సామాన్య భక్తులు అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకునేలా చర్యలు తీసుకున్న తర్వాత మిగతా విషయాలపై నిర్ణయం తీసుకోవాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రిన్సిపాల్ సెక్రటరీకి వివరించారు. దుర్గగుడిలో చేపట్టిన వివిధ పనులు, ఖర్చులపై వివిధ వర్గాల నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్నప్పటికీ ఇవో అసలు పట్టించుకోవటం లేదని కూడా ట్రస్టుబోర్డు సభ్యులు మండిపడుతున్నారు.