కృష్ణ

రోడ్ల విస్తరణలో నష్టపోయే వారికి ప్రత్యామ్నాయ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పట్టణంలో చేపట్టిన రోడ్ల విస్తరణలో దుకాణాలు నష్టపోయే వారికి ప్రత్యామ్నాయం చూపాలని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం తన నివాసంలో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ప్రధాన కూడళ్లల్లో దిశా నిర్దేశం చేసే విధంగా నామ ఫలకాలు ఏర్పాటు చేయాలన్నారు. రేవతి సెంటరు వద్ద ట్రాఫిక్ ఐలాండ్‌ను సుందరీకరణ చేయడానికి రేవతి సెంటరు నుండి బస్టాండ్ మీదుగా జెడ్పీ సెంటరు వరకు ఫుట్‌పాత్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రీ గార్డులు లేకుండా మొక్కలు నాటడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. తప్పనిసరిగా ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు స్థంభాల సెంటరు, బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలన్నారు. చిలకలపూడి సెంటరు నుండి రైల్వే స్టేషన్ వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టామన్నారు. కోనేరుసెంటరులో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు. అమృత స్కీం కింద రెండవ దశ పనులను సత్వరమే ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కమిషనర్ జస్వంతరావు, ఆర్‌అండ్‌బి ఇఇ మురళీకృష్ణ, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, బత్తిన దాస్ తదితరులు పాల్గొన్నారు.
నాట్యారామం నిర్మాణానికి రెండవ విడత నిధులు
* వేదాంతం వారి చెరువు వేలంపాట రద్దు
కూచిపూడి, ఆగస్టు 22: జాతీయ పర్యాటక కేంద్రమైన కూచిపూడిలోని వేదాంతం వారి ధర్మ చెరువు వేలంపాట రద్దయిందని పంచాయతీ కార్యదర్శి జి రామ్మోహనరావు మంగళవారం తెలిపారు. రూ. 100 కోట్ల అంచనాలతో నిర్మించే కూచిపూడి నాట్యారామం నిర్మాణంలో భాగంగా వేదాంతం వారి ధర్మ చెరువును నాట్యారామం కమిటీ చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ పర్యవేక్షణలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నాట్య పుష్కరిణిగా రూపుదిద్దె చర్యలు ప్రారంభించారు. తొలి విడతగా విడుదలైన రూ. 1.90 కోట్లతో పూడికతీత మెట్ల నిర్మాణం పూర్తయింది. తదుపరి నిధుల కొరత కారణంగా నాట్యపుష్కరిణి నిర్మాణం నిలిచిపోయింది. దీంతో ఈ చెరువులో చేపలు పెంచటానికి పంచాయతీ తీర్మానం చేసి మంగళవారం బహిరంగ వేలానికి సన్నాహాలు చేశారు. ఈ సమస్య పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు తెలియటంతో వెంటనే వేలంపాట నిలిపివేయాలని ఈవో రామ్మోహనరావును ఆదేశించారు. ప్రభుత్వ విడుదల చేసే రూ. 3 కోట్లతో చెరువు చుట్టూ పార్కు, డిజిటల్ లైటింగ్, ఫౌంటెన్, సిద్దేంద్రి విగ్రహం ఏర్పాట్లు, నృత్య స్టేజీ నిర్మాణాలకు ప్రభుత్వం విడుదల చేసే నిధులతో చేపట్టనున్నట్లు చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. అందు వలన చెరువు వేలం పాటను రద్దు చేసినట్లు సర్పంచ్ కందుల జయరామ్ తెలిపారు.