కృష్ణ

సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, సెప్టెంబర్ 12: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేర్చడమే ధ్యేయంగా టిడిపి ప్రభుత్వం పని చేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ అన్నారు. మంగళవారం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పురుషోత్తపట్నం, గోపవరపుగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి వంశీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఊర చెరువుకు జలసిరి హారతి ఇచ్చారు. పాడి రైతులకు బోనస్ పంపిణీ చేశారు. తన సొంత నిధులతో మోటార్లు ద్వారా నీటిని తరలించి చెరువులు నింపినందుకు గ్రామస్తులు వంశీని దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. రూ. 97.90 లక్షల వ్యయంతో నిర్మించే సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఢ్రైనేజీ సమస్యను ప్రజలు ఆయన దృష్టికి తేగా స్పందించి పొక్లెయిన్ రప్పించి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ పొట్లూరి బసవరావు, ఎంపిపి పట్రా కవిత, మండల పార్టీ అధ్యక్షులు పడమట సురేష్, జిల్లా సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి అనగాని రవి, వైస్ ఎంపిపి గొంది పరంధామయ్య, గుడపాటి తులసీమోహన్, పాలడుగు నాని, సర్పంచ్ కొడాలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గోపవరపుగూడెం గ్రామంలో రూ. 66.50 లక్షల వ్యయంతో నిర్మించే సిసి రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. సర్పంచ్ నల్లూరి సత్యవతి పాల్గొన్నారు.

అసెంబ్లీని తలపించేలా గుడివాడ కౌన్సిల్ సమావేశ మందిరం
గుడివాడ, సెప్టెంబర్ 12: రాష్ట్ర అసెంబ్లీని తలపించేలా గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరాన్ని నిర్మించడం అభినందనీయమని బందరు ఎంపి కొనకళ్ళ నారాయణ అన్నారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో నిర్మించిన నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనకళ్ళ మాట్లాడుతూ రూ.5కోట్లతో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించారని, ఇందులో ఆధునిక, అధునాతన టెక్నాలజీని వినియోగించారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, ఎంఈ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
గుడివాడలో ఇళ్ళస్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం
గుడివాడ పట్టణంలో ఇళ్ళస్థలాల సమస్యకు హౌస్‌ఫర్ ఆల్‌తో శాశ్వత పరిష్కారం లభించిందని బందరు ఎంపి కొనకళ్ళ నారాయణ అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన డిపిఆర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపి కొనకళ్ళ విలేఖర్లతో మాట్లాడుతూ కత్తిపూడి-ఒంగోలు ఎన్‌హెచ్ 214ఎగా ఉండేదని, దీన్ని ఎన్‌హెచ్ 165గా మార్పు చేయడం వల్ల సముద్రతీర ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన సాగరమాల ప్రాజెక్ట్‌లో ఈ రహదారి చేరిందన్నారు. దీనివల్ల పట్టణంలో ఫ్లై ఓవర్‌ల నిర్మాణాల పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్, ఎంఈ చౌదరి తదితరులు పాల్గొన్నారు.