కృష్ణ

వరకట్న వేధింపు కేసుల్లో మరింత అప్రమత్తత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: వరకట్నం వేధింపుల కేసుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ అన్నారు. రాజీవ్ శర్మ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యాజ్యాన్ని పురస్కరించుకుని సుప్రీం కోర్టు వెలువరించిన మార్గదర్శకాలపై మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో దర్యాప్తు అధికారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజీవ్ మాట్లాడుతూ వరకట్న వేధింపుల కేసుల్లో ఫిర్యాదుదారులు, ప్రతివాదులు ఇరువురూ ఇబ్బందులకు గురయ్యే సందర్భాలు ఉన్నాయన్నారు. కొంత మేర 498(ఎ) ఐపిసి సెక్షన్ దుర్వినియోగానికి గురవుతోందన్నారు. రాజీవ్ శర్మ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన సంవాదాన్ని పురస్కరించుకుని సుప్రీం కోర్టు వరకట్న వేధింపుల చట్టానికి సంబంధించి దర్యాప్తు అధికారులు, న్యాయస్థానాలకు కొన్ని మార్గర్శకాలు చేసిందన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు అధికారులు కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అందుకు గాను జిల్లా వ్యాప్తంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

50 ఎకరాల్లో జి +3 కాంప్లెక్స్‌లు
*జి+3తో ఇళ్లస్థలాల సమస్యకు చెక్
* ఇంటింటికీ టిడిపిలో మంత్రి రవీంద్ర

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: బందరు నియోజకవర్గంలో నివేశన స్థలాల సమస్యను అధిగమించేందుకు పట్టణంలో జి+3 కింద గృహ సముదాయానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో కలిసి మంత్రి రవీంద్ర స్థానిక 12, 14 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. మూడేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించటంతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రానున్న రోజుల్లో పట్టణంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 50 ఎకరాల్లో జి+3 గృహ సముదాయానికి కృషి చేస్తున్నామన్నారు. రుద్రవరం గ్రామంలో జి+3 గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అర్హులందరికీ పక్కా గృహాన్ని నిర్మిస్తామన్నారు. అలాగే సంక్షేమ పథకాలను కూడా అర్హులకు అందించడం జరుగుతుందన్నారు. పట్టణంలో వౌలిక సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఓపెన్