కృష్ణ

‘స్వచ్ఛతా సేవ’తో వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ‘స్వచ్ఛతా సేవ’ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వచ్ఛత సేవ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయటంతో పాటు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందిచే స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చేందుకు గాను స్వచ్ఛత సేవ కార్యక్రమం మరింత దోహదం చేస్తుందన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రతి గ్రామంలో చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి మరింత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కార్యాలయ ఎఓ సుబ్బారావు, సూపరింటెండెంట్లు దారం శ్రీనివాస్, జెడ్పీ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

నారుూబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
కూచిపూడి, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో లక్షలాది మంది నారుూ బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మలకాపురం కనకారావు పేర్కొన్నారు. ఈ నెల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర సమావేశంలో సంఘం తీసుకున్న నిర్ణయాలను మంగళవారం తెలిపారు. నారుూ బ్రాహ్మణులకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని, కేశఖండన శాలలో పనిచేసే పేద, బడుగువర్గాల వారికి దేవాలయాల్లో వాయిద్య కళాకారులగాను, ఉద్యోగులుగాను నియమించాలన్న తదితర 15 డిమాండ్లను వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి తుళ్ళూరి సూరిబాబు, కోశాధికారి ఎం లక్ష్మయ్యలు సంఘం అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మొవ్వ మండల అధ్యక్ష, కార్యదర్శులు పావులూరి వెంకటేశ్వరరావు, కె మురళీమోహన్‌రావు, కె సాంబశివరావు, డి అప్పయ్య, రాజకుమార్, తదితరులు పాల్గొని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పూలమాలతో ఘనంగా సత్కరించారు.