కృష్ణ

ఎకనామిక్ సిటీ ఏర్పాటుకు సత్వర చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: నగరంలో అర్బన్ హౌసింగ్ నిర్మాణ పనులు, ఎకనామిక్ సిటీ ఏర్పాటుకు సంబంధించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో టిట్‌కో, రెవెన్యూ, బ్యాంక్, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్ పథకం కింద 28,152 ఇళ్లు మంజూరయ్యాయని, వీటికి సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలు టిట్‌కో సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖ భూసేకరణ లాండ్ ఫూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా అందించేలా బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలతోపాటు వ్యవసాయ రైతులు, కౌలురైతులకు రుణాల మంజూరులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్, కృష్ణాజిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ జిల్లాలోని ఇతర బ్యాంకుల కంటే ముందంజలో వున్నాయని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రుణాల మంజూరులో బ్యాంక్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కౌలురైతులకు రూ. 100 కోట్లు అందించటం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, కాపు కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ రుణాలు 23,484 యూనిట్లు లక్ష్యంగా ఇప్పటి వరకు కేవలం 4,965 యూనిట్లు మాత్రమే మంజూరు చేయటం జరిగిందన్నారు. లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా యూనిట్లు మంజూరులో వేగవంతం జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, విఎంసి కమిషనర్ జె నివాస్, ఆర్‌డివో హరీష్, టిట్‌కో వైస్ చైర్మన్ రామనాథం, టిట్‌కో టెక్నికల్ ఎడ్వైజరీ విజయ్‌కుమార్, ఇఇ చిన్నోడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రజాహిత కార్యక్రమాలు టిడిపికే సాధ్యం
* ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: ప్రజాహితమైన కార్యక్రమాలతో ప్రజాభిమానం పొందుతున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాలనను వివరిస్తూ గత ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను మరిన్ని తెలుసుకుని పరిష్కరించే అవకాశం ఏర్పడుతుందన్నారు. అంతేక కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఏ మేర ప్రజలు సద్వినియోగం చేసుకున్నారో కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేయటంతో పాటు ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి పనులు నిర్వహిస్తూ అభివృద్ధికి కేరాఫ్‌గా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందన్నారు. సామాజిక భద్రతతో పాటు ఆరోగ్య భద్రతకు కూడా పెద్దపీట వేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కవర్ కాని బాధితులను కూడా సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లక్షలాది రూపాయలు ఆరోగ్య సమస్యకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. నీటి భద్రత విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ముందు చూపు కారణంగా నేడు డెల్టా భూములు సస్యశ్యామలంగా ఉన్నాయన్నారు. ఖరీఫ్ సీజన్ మధ్య సీజన్‌కు వచ్చినా కృష్ణాజలాలు అందని పరిస్థితి నెలకొందన్నారు. పట్టిసీమ నిర్మాణం ద్వారా ఖరీఫ్‌కు ముందస్తుగా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, టిడిపి జిల్లా కార్యదర్శి పివి ఫణి కుమార్ పాల్గొన్నారు.