కృష్ణ

ప్రణాళికాబద్ధంగా దసరా బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటూనే.. ఇప్పటికే రాకపోకలు మళ్లించారు. నేరాల నియంత్రణకు ఆదేశాలిచ్చారు. ఇక శాంతి భద్రతల విషయంలో పకడ్భందిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుండగా లక్షల్లో తరలివచ్చే భక్తులు, జనం, భవానీలు, విఐపిల భద్రతకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనరేట్ నుంచి 1800 మంది అధికారులు, సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి అదనంగా 3,700 మంది మొత్తం 5,500 మంది పోలీసు బలగాలు దసరా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. వీరందరికీ.. నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ దిశానిర్ధేశం చేశారు. బందరురోడ్డులోని పోలీసు ఆర్మ్‌డ్ రిజర్వు మైదానంలో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులు, సిబ్బంది, బలగాలకు ప్రత్యేక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పండుగ సందర్భంగా ఉత్సవాలకు వివిధ ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తి భావంతో యాత్రికులు విచ్చేస్తారని, ఈ సందర్భంలో వ్యక్తిగతంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసుగా వ్యవహరించి, స్నేహపూర్వక వాతావరణంలో కర్తవ్య దీక్షతో విధులు నిర్వహించాలని, ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సహాయపడాలని సూచించారు. ఇదొక సదవకాశంగా తీసుకుని అమ్మవారి ఉత్సవాలను పోలీసు పండుగగా భావించి విధులు నిర్వహించాలన్నారు. భక్తులు ఆలయానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వారి గమ్య స్థానాలకు క్షేమంగా చేరుకునేలా కృషి చేయాలన్నారు. రొటీన్ పద్ధతిలో పోలీసు విధులు నిర్వహించినట్లు కాకుండా పండుగ విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరితో మృదువుగా మాట్లాడుతూ వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీసుశాఖకు మంచి పేరు తీసుకువచ్చి ప్రభుత్వ, ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. పుష్కరాల్లో పని చేసిన స్ఫూర్తితో సమర్ధవంతంగా అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు. అధికారులు, సిబ్బందికి సమస్యలు ఉంటే వెంటనే సూపర్‌వైజింగ్ అధికారులకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపి బివి రమణకుమార్, డిసిపిలు కాంతి రానా టాటా, గజరావు భూపాల్, కమిషనరేట్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి బందోబస్తు విధులకు హాజరైన ఏడిసిపిలు, ఏసిపిలు, సిఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

భక్తులకు ఉచిత పార్కింగ్ సదుపాయం
* విఎంసి కమిషనర్ నివాస్ వెల్లడి
విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 19: దసరా మహోత్సవాల ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనం నిమిత్తం నగరానికి విచ్చేసే భక్తులకు ఉచిత పార్కింగ్ వసతి కల్పిస్తున్నట్టు విఎంసి కమిషనర్ జె నివాస్ పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా సుమారు 8 చోట్ల ఈ సౌకర్యాన్ని అందుబాటులో తెస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నగర ట్రాఫిక్‌కు ఎటువంటి అవరోధాలు కల్పించరాదని తెలిపారు. దుర్గా ఘాట్ వద్దగల మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంగణం, పున్నమి ఘాట్ వద్ద లోటస్ ల్యాండ్ అపార్టుమెంట్ పక్కన ప్రాంతంలో విఐపి, వివిఐపి లకు, పున్నమి ఘాట్ వద్ద, భవానీ ఘాట్ వద్ద, సీతమ్మ వారి పాదాలు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రాంగణం ఆర్‌టిసి గేటు లోపల, వన్‌టౌన్ తారా పేట గూడ్స్ షెడ్ రోడ్, పాత ప్రభుత్వ ఆస్పత్రి రోడ్డు లను ఉచిత పార్కింగ్ ప్రదేశాలుగా కేటాయించామని కమిషనర్ నివాస్ తెలిపారు.