కృష్ణ

గో ఆధారిత వ్యవసాయంతోనే దేశం సుభిక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), అక్టోబర్ 12: గో ఆధారిత వ్యవసాయంతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కుమార స్వామి అన్నారు. గురువారం స్థానిక కెడిసిసి బ్యాంక్ కాన్ఫరెన్స్ హాలులో గో ఆధారిత వ్యవసాయదారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కుమార స్వామి మాట్లాడుతూ గో ఆధారిత వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ నెల 14వ తేదీన విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల 2వ రాష్ట్ర సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫెర్టిలైజర్స్ కంపెనీలకు ఇచ్చే లక్షలాది కోట్ల రుణాలను ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఇస్తే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయన్నారు. అలాగే మార్కెటింగ్ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమావేశంలో కెడిసిసి బ్యాంక్ డైరెక్టర్ తాతా ఉమా, ప్రకృతి వ్యవసాయదారులు పేకేటి సీతారామరెడ్డి, కృష్ణారావు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు మొవ్వ విద్యార్థులు ఎంపిక
కూచిపూడి, అక్టోబర్ 12: మొవ్వ జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు గురువారం ప్రకాశం జిల్లాకు తరలి వెళ్లినట్లు హెచ్‌ఎం ఎన్‌వి శ్రీ్ధర్ తెలిపారు. ఈనెల 4వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాలుర, బాలికల కబడ్డీ జట్లకు తమ పాఠశాలకు చెందిన వేమూరి లేఖన, పేరం జ్యోతిర్మయి, జొన్నలగడ్డ శివనాగ కుమారి, బళ్లారపు రాజరాజేశ్వరి, దేవనబోయిన జానకీరామయ్య ఎంపికయ్యారన్నారు. వీరు శుక్ర, శని, ఆదివారాల్లో ప్రకాశం జిల్లాలో జరగనున్న అంతర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారని హెచ్‌ఎం తెలిపారు. క్రీడాకారులను పీడి యం శ్రీనివాస పెరుమాళ్లు, పిఇటి వేముల వెంకటేశ్వరరావు, విద్యార్థులు అభినందించారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు తలగడదీవి విద్యార్థులు
నాగాయలంక, అక్టోబర్ 12: మండల పరిధిలోని తలగడదీవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈనెల 14వ తేదీన చిత్తూరు జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిని పింగళి లలిత రత్నకుమారి, అభివృద్ధి కమిటీ చైర్మన్ వర్రే రాంబాబు గురువారం తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థులలో జూనియర్స్ బాలికల కబడ్డీ పోటీల్లో శైకం స్వప్న, నాయుడు అక్షయ, సీనియర్స్ బాలుర కబడి విభాగంలో లీలా ఆనందకుమార్ రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికైనవారిలో ఉన్నారని తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్స్ బాలికల విభాగంలో తమ పాఠశాలకే చెందిన కాట్రగడ్డ ఐశ్వర్య ఎంపికైనట్లు తెలిపారు. వీరికి గత నెల 19, 20వ తేదీలలో గుడివాడ, ఉయ్యూరులో నిర్వహించిన అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలలో రాష్ట్ర స్థాయి జట్లకు ఎంపికైనట్లు లలిత రత్నకుమారి వెల్లడించారు. అభివృద్ధి కమిటీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ఉన్న తమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు కబడ్డీలో ప్రతిభను కనబర్చటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కాలుష్యపు కోరల నుండి మా భూములను, మమ్మలను కాపాడండి
కృత్తివెన్ను, అక్టోబర్ 12: కాలుష్యపు కోరల నుండి మా భూములను, మమ్మలను రక్షించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో బాధిత రైతులు, ప్రజలు గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. రొయ్యల కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్ధపు నీటితో నాశనం అవుతున్న పంట భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు సిపిఐ ఆధ్వర్యంలో గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కమిటీ సభ్యురాలు, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ మండల పరిధిలోని మునిపెడలో ఏర్పాటు చేసిన మిలేష్ రొయ్యల కంపెనీ నుండి వచ్చే వ్యర్థపు నీరు పంట కాలువల్లో కలవటం వల్ల పంట భూములు నాశనం అవుతున్నాయని, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు తక్షణమే కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మోదుమూడి రామారావు తదితరులు మాట్లాడారు. అనంతరం తహశీల్దార్ భరత్‌రెడ్డికి వినతిపత్రం అంద చేశారు. మునిపెడ, యండపల్లి, పెందూరు, చెరుకుమిల్లి, మూలలంక, ముల్లపర్రు తదితర గ్రామాలు నుండి రైతులు నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘ ప్రధాన కార్యదర్శి మల్లినీడు యలమందరావు, ఉపాధ్యక్షుడు తమ్ము కొండయ్య, సిపిఐ నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు పోసిన మోహనరావు, గౌరిశెట్టి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.