కృష్ణ

అరెస్ట్‌లతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, అక్టోబర్ 12: న్యాయం కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రజాగళాన్ని వినిపించే వామపక్ష నాయకులను అక్రమ అరెస్ట్‌లు చేయించి ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకోవటం అవివేకమని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న సీపీఐ, సీపీఎం నేతలు కె రామకృష్ణ, పి మధు, వామపక్ష ప్రజాసంఘాల నేతలను అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని నిరసిస్తూ పది వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మైలవరం సీపీఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బోసుబొమ్మ సెంటరులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్ట్ నిర్వాశితులకు ముందుగానే పునరావాసం కల్పించిన తర్వాతనే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి బుడ్డి రమేష్, ప్రజా సంఘాల నేతలు కలిదిండి వెంకటేశ్వరరావు, కె శ్రీరాములు, గూడూరు శ్రీనివాసరెడ్డి, బి పెదబాలు, అజ్మీర భీముడు, కె శీతయ్య, శివయ్య, గురవయ్య, ఏసు, కె రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
* ముగ్గురు విద్యార్థులకు గాయాలు

మైలవరం, అక్టోబర్ 12: మైలవరానికి చెందిన ఒక ప్రైవేటు స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. మైలవరంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్‌కు చెందిన బస్సు ఎప్పటి మాదిరిగానే గురువారం పిల్లల్ని ఎక్కించుకుని చంద్రాల వైపు నుండి మైలవరం స్కూల్‌కు వస్తుండగా వెల్వడంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో పక్కనే ఉన్న ఇంటిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు అద్దాలు పగిలి ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళనతో స్కూల్ వద్దకు చేరుకుని డైరెక్టర్ రాణితో గొడవకు దిగారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలకు గాయాలయ్యాయని వారు వాదనకు దిగారు. వారికి సర్దిచెప్పి పిల్లలను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. పెద్ద ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.