కృష్ణ

అంతర్జాతీయ మల్టీసెంటర్ పరిశోధనా ప్రాజెక్ట్‌కు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, అక్టోబర్ 12: అంతర్జాతీయ మల్టీసెంటర్ పరిశోధనా ప్రాజెక్ట్‌కు గుడివాడ ప్రాంతీయ హోమియోపతి పరిశోధనా సంస్థ ఎంపికైందని సంస్థ ఇన్‌ఛార్జి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చింతా రవీందర్ చెప్పారు. గురువారం స్థానిక పరిశోధనా సంస్థ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ పరిధిలో కేంద్రీయ హోమియోపతి పరిశోధనా మండలి అర్జెంటీనాలోని యూనివర్సిడాడ్ మైమోనిడ్స్ విశ్వవిద్యాలయంతో చేసుకున్న ఎంవోయులో భాగంగా ఈ ఎంపిక జరిగిందన్నారు. క్లినికల్ పరిశోధనా ప్రాజెక్ట్‌కు సంబంధించి హోమియోపతిలో ఉన్న మ్యూరియాటిక్ గ్రూపులో ఎంపిక చేసిన లక్షణాలు వివిధ దేశాల్లోని ప్రజల్లో ఎంతవరకు ఉన్నాయి, హోమియో వైద్య చికిత్స ద్వారా ఆయా లక్షణాలు కల్గివున్న పలురకాల జబ్బుల్లో, ఎంపిక చేసిన ఐదు దేశాల్లోని ప్రజల్లో ఎంతవరకు పనిచేస్తున్నాయో నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన దేశాల్లో అర్జెంటీనా, బ్రెజిల్, ఇండియా, నెదర్లాండ్స్, రుమేనియా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మ్యూరియాటిక్ గ్రూపులోని 25హోమియో మందులపై క్లినికల్ పరిశోధనలు జరుగుతాయని, ప్రాజెక్ట్ ఇనె్వస్టిగేటర్‌గా పరిశోధనా సంస్థలోని డాక్టర్ బి రాజశేఖర్ ఎంపికయ్యారని ఆయన తెలిపారు.

మానసిక వేదనతోనే ట్రిపుల్ ఐటీ విద్యార్ధి ఆత్మహత్య
నూజివీడు, అక్టోబర్ 12:కుటుంబ సమస్యలు, మానసిక వేదనతోనే ట్రిపుల్ ఐటీ విద్యార్థి మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడని ట్రిపుల్ ఐటీ అధికార వర్గాలు, పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లా మల్కిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన సాగిరెడ్డి సత్యనారాయణ, సత్యవతి దంపతులకు ఏకైక పుత్రుడు పూర్ణ లక్ష్మీ నరసింహామూర్తి (16). పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు మూర్తికి వచ్చాయి. దీంతో రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ తరగతులు నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పియుసి గ్రూపులో మూర్తి చేరాడు. దసరా సెలవుల అనంతరం ట్రిపుల్ ఐటీకి వచ్చిన మూర్తి ముభావంగా ఉంటున్నాడని సహచర విద్యార్థులు తెలిపారు. మూర్తి తండ్రి సత్యనారాయణ హైదరబాదులో చిరుద్యోగం చేస్తున్నాడు. తల్లి సత్యవతి మానసికంగా ఇబ్బందులు పడుతూ శంకరగుప్తం గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. దీనికి ఆర్థిక సమస్యలు కూడా తోడు అయ్యాయి. ఈ తరుణంలో బుధవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు. రూమ్‌లోని సహచర విద్యార్థులు భోజనానికి వెళ్ళిన సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. భోజన అనంతరం రూమ్‌కు వచ్చిన విద్యార్థులకు రూమ్ తలుపువేసి ఉండటంతో అనుమానమొచ్చి తలుపుకొట్టగా ఎంతసేపటికీ తలుపు తీయకపోవటంతో తలుపు సందుల్లోంచి చూడగా మూర్తి ఉరి వేసుకున్నట్లు కనిపించింది. దీంతో వెంటనే ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు తలుపులు పగుల కొట్టారు. కొన ఊపిరితో ఉన్న మూర్తిని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. కుటుంబ సమస్యలు, మానసిక వేదనతో మూర్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గురువారం ఉదయం మూర్తి మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ అధికారులు ఏం జరిగిందనే విషయం స్పష్టం గా చెప్పటం లేదని, ఆత్మహత్య చేసుకునే పిరికి వాడు కాదని అన్నారు. తరగతులు ప్రారంభమై కేవలం రెండున్నర నెలలు మాత్రమే అయ్యాయని, ఇంత వరకు పరీక్షలు కూడా జరుగలేదని, పరీక్షల భయం వల్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకోలేదని ట్రిపుల్ ఐటీ వర్గాలు చెబుతున్నాయి. తమకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబం అనాధ అయిందని పేర్కొంటూ తల్లిదండ్రులు విలపించారు.
మృతి సంఘటన వెంటనే ఎందుకు చెప్పలేదు ?
ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని నూజివీడు డిఎస్‌పి వి శ్రీనివాసరావు ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు. గతంలో రెండు పర్యాయాలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనల్లో కూడా ఆలస్యంగా సమాచారం ఇచ్చారని, ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి, వైద్యశాలకు తరలించాలని సూచించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో పోలీసు పోస్టు ఏర్పాటు చేయాలని ట్రిపుల్ ఐటీ అధికారులు డిఎస్‌పి శ్రీనివాసరావును కోరారు. చివరకు విద్యార్థి మూర్తి ఆత్మహత్యకు గల కారణాలు మిస్టరీగానే మారాయి.