కృష్ణ

ప్రజా దివస్ ద్వారా సత్వర న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 16: న్యాయం కోసం పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ త్రిపాఠి సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్‌చేసి పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచే విధంగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ సబ్ డివిజన్ ప్రజల కోసం ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో, గుడివాడ, నూజివీడు, నందిగామ సబ్ డివిజన్‌ల ప్రజల కోసం ప్రతి శనివారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

ఈదురు గాలులకు పడిపోతున్న వరి పొలాలు
కూచిపూడి, అక్టోబర్ 16: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం రాత్రి నుండి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి మొవ్వ మండలంలోని పలు గ్రామాల్లోని వరి పైరు పడిపోవటంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. మొవ్వ మండలంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 11,207 హెక్టార్లలో వరి సాగైంది. ఈ నేపథ్యంలో ఐనంపూడి, భీమనది, ఉప్పాయికోడు, గేదెలకోడు, మొవ్వ డ్రెయిన్‌లు తూటుకాడ, గుర్రపుడెక్కాకులతో దట్టంగా అల్లుకుపోవటంతో మురుగునీరు పారుదలకు ఆటంకం ఏర్పడి పంట బోదెలకు ఎగదన్నుతున్నాయి. దీంతో పొలాల్లోని వర్షపునీరు బయటకు పోయే మార్గం కొరవడుతోంది. రాగల 48 గంటల్లో బంగాళ ఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని, అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాస్తవ్రేత్తల హెచ్చరికలు రైతన్నలకు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వం ఖరీఫ్ వరి సాగుకు సకాలంలో గోదావరి జలాలను కృష్ణా జలాలుగా విడుదల చేయటంతో మొవ్వ మండలంలోని రైతులు జూలై నెలలో నాట్లు వేశారు. ముఖ్యంగా పలువురు అభ్యుదయ రైతులు ఎంటియు 1056, స్వర్ణమసూరి, 5204 బిపిటి రకాలు ఆలస్యంగా వేసినా కూడా సుంకుదశకు చేరుకున్నాయి. ప్రభుత్వం సరఫరా చేసిన 1061 రకం వరి పొలాలు చిరుపొట్ట, పొట్ట దశలో ఉన్నాయి. ఈ నేపథ్యం లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిస్తే పం ట మునిగిపోతుందని రైతులు ఆందోళన చెం దుతున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన డ్రెయిన్‌లలోని గుర్రపుడెక్క, తూటు కాడను తొలగించాలని రైతులు కోరుతున్నారు.