కృష్ణ

సీఎం పీఠం కోసం ఆర్థిక నేరగాళ్ళ ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, అక్టోబర్ 16: 43వేల కోట్ల రూపాయల సొమ్ము ఈడీ నుండి జప్తు చేయబడిన 16 మాసాలు జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరగాళ్ళు మళ్ళీ దోచుకునేందుకు సీఎం పీఠం కోసం ఆరాటపడుతున్నారని గడపగడప పేరుతో వారు గ్రామాల్లోకి వస్తే తరమికొట్టండంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మండలంలోని మొర్సుమిల్లి, ములకలపెంట, పొందుగల, అనంతవరం గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా ఆయన ఆయా గ్రామాలలో ప్రసంగిస్తూ గడచిన మూడేళ్ళలో ఇచ్చిన హామీలే కాక అవసరమైన ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి ప్రజాసంక్షేమానికి కట్టుబడి పని చేస్తుంటే తమ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని, ముఖ్యమంత్రిని ఉరి తీయాలని మాట్లాడుతున్నాడని, తాను అధికారంలోకి వస్తున్నానని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచుకున్నది కాక మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజల సొమ్మును దోచుకునేందుకు ఆరాటపడుతున్నాడని వారిని తరిమికొట్టాలన్నారు. గ్రామాలలో వౌలిక సదుపాయాలు కల్పిస్తూ రోడ్లు, డ్రైన్లు, సిసి రోడ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, చంద్రన్న బీమా, విద్యుత్, వైద్యం వంటి అనేక పథకాలను అమలు చేస్తుంటే తమపై అబండాలు వేస్తారా అంటూ ప్రశ్నించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేయటంతోపాటు కోట్లాది రూపాయల విలువైన పంటలు కాపాడామని, చింతలపూడి ద్వారా మెట్టప్రాంత రైతుల పంటలు కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఏడాది తిరగకుండానే చింతలపూడి ద్వారా గోదావరి జలాలను నాగార్జున సాగరు కాలువలలో కలిపి మెట్ట రైతుల ఆశయాలను నెరవేరుస్తామన్నారు. అదేవిధంగా జలహారతి కార్యక్రమం ద్వారా వరుణుడు కరుణించి వర్షాలు పుష్కలంగా పడ్డాయని, ఈకారణంగా శ్రీశైలం, నాగార్జున సాగరు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయని, ఈయేడాది కృష్ణమ్మ నీటితో చెరువులను నింపుతున్నామని వచ్చే యేడాది గోదావరి నీటితో చెరువులను నింపటంతోపాటు సాగునీటిని పుష్కలంగా అందించనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీపధకం ద్వారా గ్రామాలలో పేదలకు పని దినాలు కల్పించి వారికి పుష్కలంగా తిండి పెడుతుంటే ఓర్వలేక వైసీపీ నేతలు ఢిల్లీలో తమ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని, పేదల నోటి కాడ కూడును కూడా లాగేసుకుంటున్నారని ఆరోపించారు. ఇటువంటి నేతలను క్షమించరాదన్నారు. అదేవిధంగా మైలవరం మండలంలో మొర్సుమిల్లి, చండ్రగూడెం, పంగిడి చెరువులను రిజర్వాయర్లుగా మార్చటానికి కృషి చేస్తానన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ మూడవ విడత విడుదల చేశామని, త్వరలోనే డ్వాక్రా మహిళలకు కూడా మార్జిన్ మనీ వేయనున్నట్లు తెలిపారు. జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో మిగిలిన అన్ని పనులను పూర్తి చేయించనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు టిడిపిలో మంత్రి సమక్షంలో చేరారు. ఈకార్యక్రమంలో పార్టీనేతలు ఎంపిపి లక్ష్మి, గొల్లపూడి వెంకటేశ్వరరావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.