కృష్ణ

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 17: పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీసు ఫంక్షన్ ఫ్లాజాలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ భావితరాల అభ్యున్నతికి తమ ప్రాణ త్యాగంతో వేసిన మార్గాలు సర్వదా ప్రాతః స్మరనీయమన్నారు. అమరవీరుల ఆత్మ బలిదానం వలన జాతి సుఖశాంతులతో మనగలుగుతుందన్నారు. మెగా వైద్య శిబిరంలో పోలీసు సిబ్బందితో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ముందుకు వచ్చి స్వచ్చందంగా రక్తదానం చేశారు. వీరితో పాటు అడిషనల్ ఎస్పీ సోమంచి సాయి కృష్ణ కూడా రక్తదానం చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డా. అల్లాడ శ్రీనివాసరావు రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ యండి మహబూబ్ బాషా, ట్రాఫిక్ డిఎస్పీ షేక్ హుస్సేన్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి గొరిపర్తి పాపరాజు, తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాసవి, చిలకలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

కేరళలో దాడులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు
* మాజీ మంత్రి కన్నా
గుడివాడ, అక్టోబర్ 17: కేరళలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడులు ఆపకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బిజెపి జాతీయ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో కేరళలో సిపి ఎం గూండాల దాడులను నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా విలేఖర్లతో మాట్లాడుతూ అధికార పార్టీ అండతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా, విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతున్నారన్నారు. ఈ ఘటనలను కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్పందనపై కేంద్రం వేచిచూస్తోందని చెప్పారు. వెంటనే చర్యలకు దిగకుండా సమర్ధించే ధోరణిని అవలంభిస్తే కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి దాడులను నివారించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామినేని వెంకటకృష్ణ మాట్లాడుతూ కేరళలో జరుగుతున్న దాడులను దేశంలోని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. వీటిని పట్టించుకోని విధంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ముందుగా స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సమీపంలో మాజీ మంత్రి కన్నాకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి బైక్ ర్యాలీగా నెహ్రూచౌక్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ధనియాలపేటకు చెందిన 100మంది కార్యకర్తలు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సూరే గాంధీ, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు, నాయకులు శలంకాయల లీలాకుమారి, మహేష్, సిహెచ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.