కృష్ణ

బదిలీలు సరే రిలీవ్ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 20: ప్రభు త్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీల కోసం దాదాపు దశాబ్ద కాలంగా సుదీర్ఘ పోరా టం జరుగుతూ వచ్చింది. మొత్తంపై ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ ఓ ప్రహసనంలానే సాగింది. ఎందుకంటే సవరణలు.. మార్పులతో ఒకటి రెండుసార్లు కాదు పదిసార్లకు పైగా జీవోలు మారాయి. ఈ బదిలీలు ఏ విధంగా.. ఎలా జరిగినప్పటికీ బదిలీ అయిన వారిలో మాత్రం కించిత్ సంతోషం కన్పించడం లేదు. విచిత్రకర పరిస్థితి ఏమంటే బదిలీల ప్రక్రియ ముగిసి 2 మాసాలు దాటుతున్నా రాజధాని ప్రాం త కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు వందమందికి పైగా టీచర్లు మాత్రం రిలీవ్ కాక గత్యంతరం లేని స్థితిలో తమ తమ పాత పాఠశాలల్లోనే కొనసాగుతున్నారు. కాగా వీరి స్థానాల్లో కొత్త గా వచ్చేవారు లేకపోవటంతో రిలీవర్ లేకుండా వీరిని బదిలీ చేయవద్దంటూ విద్యాశాఖ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాలతో కృష్ణా, గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారులు వీరిని రిలీవ్ చేయలేకపోతున్నారు. మొత్తమీద వీరంతా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. బదిలీ అయిన వెంటనే ఎవరికి వారు తమ కుటుంబ సభ్యులతో స్థావరాలు మార్చేశారు.. ఇళ్లు ఖాళీ చేసేస్తున్నామంటూ అద్దె ఇంటి యజమానులకు చెప్పేశారు. దీంతో కొందరు అద్దె ఇళ్లు ఖాళీ చేసి స్నేహితుల ఇళ్లలో లేదా పాఠశాల గదుల్లోనే ఉంటూ కాలక్షేపం చేయాల్సి వస్తున్నది. వీరితోపాటు బదిలీ అయినవారు ఆనాడే ఎంచక్కా తమ పిల్లాపాపలతో వెళ్లిపోయి కొత్త పాఠశాలల్లో చేరిపోవటం కూడా జరిగింది. ఇదిలా ఉంటే భవిష్యత్‌లో తిరిగి బదిలీలు జరిగే సమయంలో బదిలీ అయిన నాటి నుంచి కొత్త పాఠశాలల్లో చేరిన తేదీని పరిగణనలోకి తీసుకుని వారికి పాయింట్లు కేటాయిస్తే తమకు తీరని అన్యాయం జరిగిపోతుంది కదా అంటున్నారు. మరో విచిత్రకర పరిస్థితి ఏమిటంటే తమను రిలీవ్ చేయకపోవటంతో బదిలీ అయినవారు బోధన పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపటం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో వీరు తమకు కేటాయించిన పాఠశాలల్లో చేరకపోవటంతో అక్కడ టీచర్లు లేక బోధన జరగటం లేదు. వాస్తవానికి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అత్యధికంగా 200 టీచర్ పోస్టులు, అలాగే సముద్రతీర ప్రాంత రేపల్లె, నిజాంపట్నం, నదీ తీర ప్రాంత క్రోసూరు, అచ్చంపేట ప్రాంతాల్లో మరో వంద వరకు ఖాళీలున్నాయి. ఇక కృష్ణాలో కైకలూరు, అవనిగడ్డ, వత్సవాయి, తిరువూరు, మైలవరం ప్రాంతాల్లో వంద టీచర్ పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో అత్యధికం ఉన్నత పాఠశాలల్లో ఉన్నాయి. ఇక సెకండరీ గ్రేడ్ పోస్టులు ఈ రెండు జిల్లాల్లో కనీసం 150 వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే ఈ రెండు జిల్లాల్లో కనీసం 150 మంది వరకు పదోన్నతి కల్పించవచ్చు. దీనివల్ల ఉన్నత పాఠశాలల్లో ఖాళీలను భర్తీచేసే అవకాశం ఉంది. విద్యా సంవత్సరం ముగింపునకు మరో నాలుగు మాసాలు కూడా లేనప్పటికీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పట్ల విద్యాశాఖ నిర్లక్ష్యం, తాత్సారం ఏ మాత్రం సరైంది కాదని ఇటు ఉపాధ్యాయ సంఘాలు, అటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.