కృష్ణ

ప్రజల కష్టసుఖాలు తెలిసిన కలెక్టర్ లక్ష్మీకాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, అక్టోబర్ 22: ప్రజల కష్టసుఖాలు తెలిసిన కలెక్టర్‌గా లక్ష్మీకాంతం పేరుగడించారని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జిల్లాలో గతంలో పని కలెక్టర్లకు భిన్నంగా లక్ష్మీకాంతం పాలన ఉందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అక్కడే ప్రత్యక్షమై ఆ సమస్య పరిష్కారంలో కలెక్టర్ చూపుతున్న ప్రతిభ అనితర సాధ్యమన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల కాలానికే జిల్లా వాసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరింప చేసుకున్న లక్ష్మీకాంతంను ఆదివారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పెన్‌జాప్ ఆధ్వర్యంలో పౌర సన్మానం నిర్వహించారు. పత్రికా రంగ పితామహులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తాను పదవీ బాధ్యతలను చేపట్టిన ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లటం ద్వారా వనె్న తెచ్చిన అధికారిగా ప్రభుత్వంచే గుర్తింపు పొందగలిగారన్నారు. కలెక్టర్‌గా లక్ష్మీకాంతం బాధ్యతలను చేపట్టి ఆరంభ దశలోనే జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగవంతంగా అమలు జరిపే విషయంలో నిరంతరం కృషి చేస్తూ వస్తున్నారన్నారు. ముఖ్యంగా పొగ రహిత జిల్లాగాను, సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా ఇ-పోస్ విధానంలో అగ్రగామిగా, ఆర్థిక రంగంలో ముందస్తుగా ఉండే విధంగా ఆయన అధిక సమయం కేటాయించటం సామాన్య విషయం కాదని ఉప సభాపతి కితాబిచ్చారు. పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు సభకు అధ్యక్షత వహిస్తూ తన ఏడు పదుల పత్రికా రంగం అనుభవంలో ఎంతోమంది కలెక్టర్ల పని తీరును సమీక్షించానని, లక్ష్మీకాంతం వంటి సమర్ధవంతమైన అధికారిని ఇప్పుడే చూస్తున్నానన్నారు. 1945లో బ్రిటిష్ కాలంలో పనిచేసిన ఓ యూరేపియన్‌కు చెందిన వ్యక్తి కలెక్టర్‌గా చేసిన విషయం గుర్తుందని, ఆ తదుపరి పలువురు కలెక్టర్లు ఈ జిల్లాలో పని చేసినప్పటికీ ప్రజలు వారి వద్దకే వెళ్లే పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం లక్ష్మీకాంతం ఈ జిల్లా కలెక్టర్‌గా వచ్చిన వెంటనే ఆయనే ప్రజల వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకుని పరిష్కరించటం విశేషమన్నారు. పౌర సన్మానం అందుకున్న కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ తాను ఈ జిల్లాలో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని, జిల్లాలో సాధించిన అభివృద్ధి స్వల్పమని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఎన్‌వివి సత్యనారాయణ, పెన్‌జాబ్ రాష్ట్ర అధ్యక్షుడు బడే ప్రభాకరరావు, తూర్పు కృష్ణా ఎన్‌జిఓ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వుల్లి కృష్ణ, దారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.