కృష్ణ

ఇన్‌ఛార్జ్‌ల పాలనకు మంగళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 22: నిన్న మొన్నటి వరకు ఇన్‌ఛార్జ్‌ల బందీఖానాలో ఉన్న జిల్లాకు విముక్తి లభిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్‌ఛార్జ్‌ల స్థానంలో రెగ్యులర్ అధికారుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన బదిలీలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. రెండు రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా 66 మంది డెప్యూటీ కలెక్టర్లను బదిలీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టులు భర్తీ అయ్యాయి. జిల్లా పాలనావ్యవహారాల్లో కీలక భూమిక పోషించే జిల్లా రెవెన్యూ అధికారి పోస్టుతో పాటు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) వైస్ చైర్మన్ పోస్టులకు రెగ్యులర్ అధికారుల నియామకం జరిగింది. రెండున్నర సంవత్సరాలుగా డిఆర్‌ఓ పోస్టు ఖాళీగా ఉంది. ఈ రెండున్నర సంవత్సరాల పాటు నలుగురు అధికారులు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహించారు. గతంలో రెగ్యులర్ డిఆర్‌ఓగా పనిచేసిన ఆలపాటి ప్రభావతి బదిలీ తర్వాత బందరు ఆర్డీవో సాయిబాబు కొంత కాలం ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య, ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ముడ విసి వేణుగోపాలరెడ్డి గత రెండు నెలల కిందట బదిలీ కావటంతో మళ్లీ నూజివీడు ఆర్డీవో రంగయ్యకే మళ్లీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఈ పోస్టుకు రెగ్యులర్ అధికారిని నియమించారు. నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా పని చేస్తున్న బిఆర్ అంబేద్కర్‌ను రెగ్యులర్ డిఆర్‌ఓగా బదిలీ చేయగా శనివారం పదవీ బాధ్యతలు సైతం స్వీకరించారు. డిఆర్‌ఓ పోస్టుతో పాటు బందరు ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడ) వైస్ చైర్మన్ పోస్టు సైతం భర్తీ అయ్యింది. ముడ వైస్ చైర్మన్‌గా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న శ్యామ్ ప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. ఈయన కూడా రేపోమాపో బాధ్యతలు స్వీకరించనున్నారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టులు రెగ్యులర్ అధికారులతో భర్తీ అయ్యాయి. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారిణిగా కె శ్రీదేవి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ప్రసాద్, జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న భాస్కర ప్రసాద్‌నే రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం నియమించగా వీరంతా విధుల్లో సైతం చేరారు. ఇకపోతే మూడు కీలక పోస్టులు భర్తీ కావల్సి ఉంది. జిల్లా విద్యా శాఖాధికారి పోస్టుతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈ మూడు పోస్టులు కూడా భర్తీ అయితే జిల్లాకు పూర్తి స్థాయి అధికార యంత్రాంగం సమకూరినట్లవుతుంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఇటీవలే జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అవ్వగా ఆయన స్థానంలో మరో సమర్ధవంతమైన మహిళా అధికారిణి విజయకృష్ణన్ నియమితులయ్యారు. అలాగే జాయింట్ కలెక్టర్-2గా వ్యవహరిస్తున్న బి మార్కండేయులు ప్రకాశం జిల్లా జెసి-2గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నియమితులైన పిడుగు బాబూరావు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు కీలక పోస్టులు ఇన్‌ఛార్జ్‌ల పర్వంలో కొనసాగటంతో ఆయా శాఖల ప్రగతి నెమ్మదించింది. అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులకు సైతం పని ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం సిఫార్సుల మేరకు ఖాళీ పోస్టులన్నీ ఒక్కొక్కటిగా భర్తీ అవుతున్నాయి.

నేడు డయల్ యువర్ కలెక్టర్

మచిలీపట్నం, అక్టోబర్ 22: ప్రజా సమస్యల పరిష్కార చర్యల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం నేరుగా ప్రజల నుండి వచ్చిన ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకుని వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా తొలిసారిగా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం 9.30ని.ల నుండి 10.30 ని.ల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో డయల్ యువర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలనుకుంటే 08672-252399 నెంబరుకు ఫోన్ చేయాల్సిందిగా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.