కృష్ణ

జగన్ ప్రజాసంకల్ప యాత్రకు మద్దతుగా భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, నవంబర్ 12: రాష్ట్ర వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గుడివాక శివరావు నాయకత్వంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. మండల పరిధిలోని రేమాలవారిపాలెం వంతెన వద్ద వేంచేసియున్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన అనంతరం శివరావు ఆధ్వర్యంలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో యువకులే గాక మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొని తమ ప్రియతమ నేత జగన్మోహనరెడ్డి నాయకత్వం, శివరావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో వందలాది మంది యువకులు ద్విచక్ర వాహనాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరావు విలేఖర్లతో మాట్లాడుతూ తమ పార్టీ నేత జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు మద్దతుగా తాము అవనిగడ్డ నియోజకవర్గ స్థాయిలో పాదయాత్రను చేపట్టాలని ముందుగానే నిర్ణయించామని, ఆ మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

పాలకేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించిన చైర్మన్ మండవ

మైలవరం, నవంబర్ 12: పుల్లూరు శివారు కొత్తగూడెంలో ఇటీవల 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాలశీతలీకరణ కేంద్ర నూతన భవనాన్ని విజయా డెయిరీ చైర్మన్ మండవ జానకిరామయ్య ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకేంద్రం వల్ల చుట్టుపక్కల గ్రామాలలోని సుమారు 16 పాల సొసైటీలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆయా గ్రామాలలోని పాల ఉత్పత్తిదారులు ఈకేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈకార్యక్రమంలో కొత్తగూడెం పాల ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షులు అవుతు మోహనరెడ్డి, కృష్ణామిల్క్ యూనియన్ జిల్లా పాలకవర్గ సభ్యులు, మేనేజింగ్ డైరెక్టర్ టి బాబూరావు, జనరల్ మేనేజర్ ఎన్ జగన్మోహనరావు, డైరెక్ట్‌రూట్స్ మేనేజర్ కె ప్రసాద్, స్థలదాత అప్పిడి సత్యనారాయణరెడ్డి, పాల ఉత్పత్తిదారులు, పాలకవర్గ సభ్యులు, రూట్ సూపర్ వైజర్స్, బి నాగేశ్వరరావు, సంఘ వేతనకార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

వడ్లమన్నాడు డ్రైన్‌ను పరిశీలించిన డ్రైనేజీ అధికారులు
* ‘్భమి’ కథనానికి స్పందన
గుడ్లవల్లేరు, నవంబర్ 12: వడ్లమన్నాడు డ్రైన్ ఎగదన్ని 3వేల ఎకరాలు ముంపునకు గురైనట్లు ఆంధ్రభూమి కథనం ద్వారా తెలుసుకున్న డ్రైనేజీ అధికారులు ఆదివారం వడ్లమన్నాడు డ్రైన్‌ను పరిశీలించారు. ఆ శాఖ ఇఇ చంద్రశేఖర నాయుడు, ఎఇ మురళి పొలాలు నష్టపోయిన రైతులతో కలిసి డ్రైన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు, న్యాయవాది పెనే్నరు ప్రభాకరరావు మాట్లాడుతూ వడ్లమన్నాడు డ్రైన్‌కు ఎగువ నుండి పెద్ద ప్రవాహంగా మురుగునీరు వస్తుండటంతో ప్రతి సంవత్సరం వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పంట చేతికి వచ్చే సమయంలో డ్రైన్ ఎగదన్నుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పది రోజుల కిందట పొక్లైన్ సాయంతో మొక్కుబడిగా నీటిపై ఉన్న తూడు, గుర్రపు డెక్కను మాత్రమే తొలగించారని, డ్రైన్ అడుగున ఉన్న నాసుకర్ర, ఇసుక దిబ్బలను తొలగించకపోవడం వల్ల ముంపు సమస్య ఏర్పడిందన్నారు. డ్రైనేజీ ఇఇ చంద్రశేఖర నాయుడు మాట్లాడుతూ రెండు రోజుల్లో డ్రైనేజీలో ఉన్న ఇసుక దిబ్బలను తొలగిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.