కృష్ణ

కృష్ణానదిలో మునిగి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 12: మండలంలోని రావిరాల కృష్ణానదిలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు మునిగి షేక్ షాహిన్ (8) బాలుడు మృతి చెందగా ఎస్‌కె నేహియా బాలిక ప్రాణపాయస్థితిలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సేకరించిన సమాచారం ప్రకారం జగ్గయ్యపేట పట్టణం డాంగేనగర్‌కు చెందిన పది మంది ముస్లిం మహిళలు విజయవాడ వచ్చి బంధువులు, పిల్లలతో కలిసి రావిరాల కృష్ణానదికి సరదాగా వెళ్లారు. కొంత మంది నది ఒడ్డునే స్నానం చేయగా రేష్మా అనే మహిళ కొడుకు షాహిన్, వరుసకు కూతురు అయిన నేహియాతో కలిసి నది లోతు భాగానికి వెళ్లింది. అక్కడ గుంటలు ఉండటంతో ప్రమాదానికి గురై నదిలో మునిగిపోతూ చేతులు పైకి ఎత్తి కాపాడమని కేకలు వేయడంతో వడ్డున ఉన్న కొంత మంది స్థానికులు ఈత కొట్టుకుంటూ వెళ్లి మహిళను, బాలికను కాపాడి ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. నీటిలో మునిగిన షాహిన్ గంట సేపటికి గానీ దొరకలేదని వారు తెలిపారు. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో పాటు ప్రమాద సంఘటనపై ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌కు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి రెండు అంబులెన్స్‌ల ద్వారా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. వీరిలో షాహిన్ అప్పటికే మృతి చెందినట్లు పరీక్షలు చేసిన వైద్యులు నిర్థారించగా బాలిక నేహియాకు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాద సంఘటనతో షాక్‌కు గురైన రేష్మాకు తన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడని భావించి వైద్యం చేయాలని రోదిస్తూ డాక్టర్‌లను అడగడం ఆసుపత్రిలోని అందరి హృదయాలను కలచివేసింది. ఈ ప్రమాద సంఘటనతో ముస్లిం కుటుంబాల్లో విషాదం నెలకొంది. చిల్లకల్లు ఎస్‌ఐ సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.