కృష్ణ

సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను చేధించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 12: సాంకేతిక సహకారంతో కేసులను చేధించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో బందరు, అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వల్ల న్యాయస్థానాల్లో బలమైన సాక్ష్యాధారాలను చూపి నేరస్థులకు శిక్ష పడేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి వాటిని ఛార్జ్‌షీట్ దాఖలు చేసే విధంగా పలు సూచనలు చేశారు. దర్యాప్తులో ఉన్న కీలక కేసుల విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని పరిష్కరించాలన్నారు. నెల నెలా జరిగే నేర సమీక్షా సమావేశాలకు పోలీసు అధికారులు సమగ్ర సమాచారంతో రావాలన్నారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులు అనే వర్గీకరణతో కాకుండగా నమోదైన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేపట్టాలన్నారు. ఇటీవల కాలంలో అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పంట కాలువల్లో గుర్తు తెలియని మృతదేహాలు వస్తున్నాయని, ఆ మృతదేహాల వివరాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ వారి సాంకేతిక సహకారం తీసుకోవాలన్నారు. కీలక కేసుల్లో న్యాయ నిపుణుల సూచనలు తీసుకుని ఆ దిశగా ఛార్జ్‌షీట్‌లను న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ, బందరు, అవనిగడ్డ డీఎస్పీలు యండీ మహబూబ్ బాషా, పోతురాజు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ పి లక్ష్మీనారాయణ, ఎస్‌సి, ఎస్‌టి సెల్ డీఎస్పీ హరిరాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

బందరు పోర్టు, కమర్షియల్ కోర్టుపై అసత్య ప్రచారాన్ని మానుకోండి
* పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోగంటి సాయిమోహన్

మచిలీపట్నం, నవంబర్ 12: కోర్టు లేదు పోర్టు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కోగంటి సాయి మోహనరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక బార్ అసోసియేషన్ హాలు వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంత మంది కావాలనే ఇటువంటి అసత్య ప్రచారం చేస్తూ పుర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కమర్షియల్ కోర్టును బందరులోనే ఏర్పాటు చేయాలని తామంతా సిఎం చంద్రబాబు నాయుడుని కలవగా ఆయన సానుకూలంగానే స్పందించారన్నారు. బందరు ఓడరేవు విషయంలో భూ సమీకరణకు న్యాయవాదులు కూడా సహకరించాలని కోరారని, కొంతమంది దీన్ని వక్రీకరించి కోర్టు లేదు పోర్టు లేదని సిఎం వ్యాఖ్యలు చేశారని ప్రచారం చేయడం బాధాకరమన్నారు. కమర్షియల్ కోర్టు కోసం బార్ అసోసియేషన్ చేస్తున్న కృషికి న్యాయవాదులు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, సీనియర్ న్యాయవాదులు పుప్పాల ప్రసాద్, మహ్మద్ సులేమాన్, ఎం సాయి వెంకట్రావు, అజ్మతున్నీసా, న్యాయవాద గుమస్తాల సంఘం ప్రతినిధి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.