కృష్ణ

కార్తీక సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 12: శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం చివరి ఆదివారం కావటంతో జిల్లాలో కార్తీక సందడి నెలకొంది. ఎక్కడ చూసినా వన సమారాధనలతో సందడి వాతావరణం కనిపించింది. సాగర తీరాలు, కృష్ణానది పరివాహక ప్రాంతాలు కార్తీక వన సమారాధనలతో ఆహ్లాదకరంగా మారాయి. శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మికత వాతావరణం చోటు చేసుకుంది. జిల్లాలో విస్తారంగా ఉన్న సాగర తీరానికి యాత్రీకులు పోటెత్తారు. ఇటు కృత్తివెన్ను మండలం పెదగొల్లపాలెం బీచ్ మొదలకుని మంగినపూడి బీచ్, సాగర సంగమ ప్రాంతమైన హంసలదీవి సముద్ర తీరాలు పర్యాటకులకు ఉప్పొంగాయి. అవనిగడ్డ, నూజివీడు, నందిగామ, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న మామిడి తోటలు, అరటి తోటలు కార్తీక వన సమారాధనలకు వేదికగా మారాయి. సకుటుంబ సమేతంతో పాటు కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా వన సమారాధనలు జరిగాయి. కొన్ని చోట్ల వర్గాలకు అతీతంగా పలు సంస్థల ఆధ్వర్యంలో వన సమారాధనలు జరిగాయి. ఆయా వన సమారాధనలకు ఆ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానంగా మంగినపూడి బీచ్, హంసలదీవి బీచ్‌లకు యాత్రీకులు, పర్యాటకులు పోటెత్తారు. వేలాదిమంది యాత్రీకులు ఆయా బీచ్‌లకు వచ్చి సరదాగా గడిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు యాత్రికుల రాకపోకలు సాగించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయస్సులవారు అన్ని వర్గాలకు చెందిన వారు పెద్ద ఎత్తున సకుటుంబ సమేతంగా, బంధుమిత్రులతో విహార యాత్రగా తరలి వచ్చారు. సముద్ర అలల హోరుకు యువత కేరింతలు కొట్టారు. సముద్ర స్నానాల అనంతరం సమీపంలోని సరుగుతోటలు, మామిడి తోటల్లో వన భోజనాలు చేశారు. వన భోజనాల సందర్భంగా ఆటపాటలతో సందడి చేశారు. సముద్ర స్నానాల్లో ఎటువంటి అపశృతులకు దొర్లకుండా బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, అవనిగడ్డ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మూర్తి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.