కృష్ణ

ఈ-ఆఫీస్ నిర్వహణలో జిల్లాకు ప్రథమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 18: జిల్లాలోని వివిధ శాఖల కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల పరిష్కారంలో 64.81 శాతం సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ స్థాయి నుండి పైళ్ల పరిష్కారానికి ఈ-ఆఫీస్ పద్ధతిని జిల్లాలో అమలు చేస్తున్నామన్నారు. అన్ని శాఖలు ఈ-ఆఫీస్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాలన్నారు. గ్రీవెన్స్‌కు సంబంధించి అలర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా సమస్యల పరిష్కారంలోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.