కృష్ణ

కనీస మద్దతు ధరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: ఖరీఫ్‌లో పండిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు పూర్తిగా కొనుగోలు చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ అన్నారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జాయింట్ కలెక్టర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1,43,376 హెక్టార్లలో వరిని పండించడం జరిగిందని, తద్వారా 8,63,133 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించిందని గ్రేడ్ ఎ క్వింటాల్‌కు రూ. 1590, కామన్ రకంకు రూ. 1550 ఉన్నాయన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 319 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో వెలుగు ఆధ్వర్యంలో 72, ప్రాథమిక సహకార పరపతి సంస్థ ద్వారా 227, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ద్వారా 20 కేంద్రాలు పని చేస్తాయని ఆమె అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద 2,15,78,325 గోనె సంచులను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో అన్ని గోడౌన్‌లలో 2,10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం నిలువ చేసేందుకు అవకాశం ఉందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులను నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద బేనర్ ఏర్పాటు చేశామని, తేమ కొలిచే యంత్రాలు, వెయింగ్ మిషన్స్, కంప్యూటర్ వంటి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని ఆమె వివరించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి ప్రభుత్వం అందిస్తున్న కనీస మద్దతు ధరను పొందాలని అన్నారు. దళారీలను నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాలను పెంచి రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ వివరించారు. జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను నెలలోని మొదటి వారంలో నే కార్డుదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో నేటి వరకు 14,03,903 రేషన్‌కార్డులు ఉన్నాయని, 50 మండలాల్లో 2,291 చౌకధరల దుకాణాలు పని చేస్తున్నాయన్నారు. ఈ-పోస్ విధానం ద్వారా 2015, మే నెల నుంచి 2017, అక్టోబర్ వరకు రూ. 161,18 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేశామన్నారు. జిల్లాలోని 7,237 సంక్షేమ వసతి గృహాలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని ఆమె వివరించారు.