కృష్ణ

భక్తులతో కిటకిటలాడిన కృష్ణా పరివాహక ప్రాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 19: పాడ్యమి పోలి స్వర్గంను పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుఝామున వేలాదిగా తరలివచ్చిన భక్తులతో మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలైన వేదాద్రి, ముక్త్యాల, పాలేటి తీరం కె అగ్రహారం భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణానదిలో అరటిదొప్పలతో దీపాలను వెలిగించి కృష్ణానదిలో వదిలారు. శనివారం రాత్రికే వివిధ ప్రాంతాల నుండి వేదాద్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్రచేసి తెల్లవారుఝామున 3గంటల నుండే కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి నదిలో వదిలారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి డి శ్రీరాం వరప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు సౌకర్యాలు కల్పించి, గజ ఈతగాళ్లను, పడవలను ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. ముక్త్యాల కృష్ణానది, కె అగ్రహారం పాలేటిలో సైతం పెద్ద ఎత్తున భక్తులు దీపాలు వెలిగించి శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామివారిని, శ్రీఓంకారేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. కోటిలింగాల హరిహర మహాశైవ క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది.
మచిలీపట్నంలో...
మచిలీపట్నం (కల్చరల్) : కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆదివారం పోలి స్వర్గారోహణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి స్థానిక నాగులేరు(మంచినీటి కాలువ), చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి ఆలయంలోని కోనేరు, రాబర్ట్‌సన్‌పేట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో దీపాలను వదిలారు. అనంతరం ఆయా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

అంచెలంచెలుగా ప్రజా సమస్యల పరిష్కారం
* పెడన నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్

బంటుమిల్లి, నవంబర్ 19: రాజన్న రాజ్యం వచ్చిన వెంటనే రచ్చబండలో ఎదురైన ప్రజా సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరిస్తామని పెడన నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాల్లో భాగంగా నాగన్నచెరువు, నెహ్రూ నగర్, లక్ష్మీపురం గ్రామాల్లో రచ్చబండ-పల్లెనిద్ర కార్యక్రమాలను ఆదివారం చేపట్టారు. మంచినీరు, రహదారుల సమస్యలు రాగా లక్ష్మీపురంలో తమ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరం వెళితేగాని వైద్యం చేయించుకునే అవకాశం లేదని, గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు కృషి చేయాలని లక్ష్మీపురం ప్రజలు కోరారు. ఆనందరావు అనే కార్మికుడు ఆటో ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడని, అయితే చంద్రన్న బీమా పథకం సంవత్సరం అయినా తనకు ఏమీ రాలేదని బాధితుడు పేర్కొన్నారు. లక్ష్మీపురం గ్రామ స్మశానానికి దారి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరారు. ఈ సమస్యలపై ఉప్పాల రాంప్రసాద్ స్పందిస్తూ చిన్న చిన్న సమస్యలను ఆయా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. సాధ్యంకాని పనులను ప్రయారిటీ ప్రకారం వైకాపా అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నెహ్రూ నగర్‌లో నాయకులు పల్లెనిద్రకు ఉపక్రమించారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువనేత ఉప్పాల రాము, ముత్యాల నాగేశ్వరరావు, తిరుమాని శ్రీనివాసరావు, కొప్పర్తి సుబ్బారావు, మలిశెట్టి రాజబాబు, నాగేశ్వరరావు, పి సువర్ణ బాబూరావు, మద్దాలి లక్ష్మీనారాయణ, చిన్నారిబాబు, జల్లా కనకరాజు, కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, వనమాల నారాయణరావు, వల్లభు నరసింహం, వల్లభు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.