కృష్ణ

ఉప్పెన, తుఫాన్‌ల నివారణ నదుల అనుసంధానంతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, నవంబర్ 19: నదుల అనుసంధానం ద్వారా మాత్రమే దేశంలో తరచుగా వచ్చే ఉప్పెన, తుఫానులను నివారించటం సాధ్యపడుతుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. స్థానిక గాంధీ క్షేత్రంలో దివిసీమకు ఉప్పెన వచ్చి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆదివారం జరిగిన సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నదుల అనుసంధానానికి విశేష కృషి చేస్తున్నారన్నారు. వచ్చే నాలుగైదు సంవత్సరాలలో నదుల అనుసంధాన కార్యక్రమం పూర్తవుతుందన్నారు. 1977లో సంభవించిన ఉప్పెన, తుఫాన్ విషాధకరమైన సంఘటన అని, ఆ సందర్భంలో శవాలు కుప్పలుగా పడి ఉండటం, పశు కళేబరాలను తాను చూసిన దృశ్యాలను మరువలేనన్నారు. ఆ సందర్భంలో రెండు సంవత్సరాలు పాటు దివిసీమలోనే ఉండి దీనదయాళపురం గ్రామాన్ని నిర్మించటం జరిగిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నేత సోమయ్య ఆదేశం మేరకు ఐదుగురు కార్యకర్తలతో దివిసీమకు తాను చేరుకున్నానని, ఆ సందర్భంలో కుప్పలుగా పడి ఉన్న శవాలను శవసేన పేరుతో తామే స్వయంగా ఖననం చేయటం జరిగిందన్నారు. ఈ దృశ్యాలను చూసిన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగలరావు తమను చూసి పోలీసులు అనుకున్నారని, తరువాత విచారించిన ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలుగా గుర్తించి అభినందించారన్నారు. ఈ విషాధ సంఘటన సమయంలో అప్పటి కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి తమకు ఎంతగానో సహకరించారని, ఆ సందర్భంలో తనకు ఆశ్రయమిచ్చిన దివంగత మండలి వెంకట కృష్ణారావు సతీమణి ప్రభావతి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారన్నారు. అందరినీ ఏకీకృతం చేయటం ద్వారానే ఈ తరహా సేవా కార్యక్రమాలు సాధ్యపడతాయన్నారు. తాము ప్రకృతిపై విజయం సాధించామన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే తాను దీనదయాళపురంలో తొమ్మిది నెలల కాలంలో 108 గృహాలు నిర్మించటం జరిగిందన్నారు. ఈ సభకు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించగా మాజీ ఐఎఎస్ అధికారి మోహన్ కందా, శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణి, మాజీ ఎస్పీ ఎస్ వీరనారాయణరెడ్డి, శశికాంతానంద స్వామి, సత్యానంద భారతీ స్వామి, నౌఘోరా, జి గోపాలకృష్ణమూర్తి, మత్తి శ్రీనివాసరావు, డా. నారాయణ, ఐలాపురం వెంకయ్య తదితరులు ప్రసంగించారు. అంతకుముందు ఉప్పెన, తుఫాన్‌కు సంబంధించిన ఫొటో ప్రదర్శనను దత్తాత్రేయ తిలకించారు. అనంతరం దివంగత వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని గాంధీ క్షేత్రం కమిటీ, గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా మండలి రాజా కూడా పాల్గొన్నారు.