కృష్ణ

రైతుల అభివృద్ధే సీఎం చంద్రబాబు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, నవంబర్ 21: రైతుల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయమని జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు శాయన పుష్పవతి అన్నారు. స్థానిక మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మంగళవారం రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా రైతులకు ఎలాంటి లోటు లేకుండా వారి అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. రూ.13లక్షలు విలువ చేసే నాట్లు వేసే యంత్ర పరికరాన్ని 50శాతం సబ్సిడీపై రైతు చాపరాల జగన్మోహనరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొసరాజు విజయ భారతి, మండల వ్యవసాయ శాఖ అధికారిణి నిమ్మగడ్డ రమాదేవి, రైతులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో దళారులకు చోటిస్తే చర్యలు తప్పవ్

మైలవరం, నవంబర్ 21: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకే న్యాయం జరగాలని దళారులకు చోటిస్తే చర్యలు తప్పవని తహశీల్దార్ కెవి శివయ్య సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన డివిజనల్ సివిల్ సప్లై ఏఎస్‌ఓ పి కోమలి పద్మతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కొనుగోళ్ళను పరిశీలించారు. ముఖ్యంగా రైతులకు యార్డులో అవసరమైన సదుపాయాల కల్పనపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, తేమ కొలిసే యంత్రం, బ్యానర్లు, ధరలకు సంబంధించిన కరపత్రాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు బయటి మార్కెట్‌లో అధిక ధర వస్తే విక్రయించుకోవచ్చన్నారు. దళారులకు చోటివ్వవద్దని ఆయన హితవు పలికారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రంలో పెసలు ఇప్పటి వరకూ 628 క్వింటాళ్ళు కొనుగోలు చేయటం జరిగిందని, రైతులు తమ వద్ద ఉన్న పెసలను ఆరబెట్టుకుని తెచ్చి అమ్ముకోవాలని సూచించారు. మినుములు ఇప్పటి వరకూ కొనుగోలు చేయలేదని, ఈరోజునుండి మినుమలులు కూడా కొనుగోలు చేయటం జరుగుతుందని తెలిపారు.