కృష్ణ

సీసీఐ ప్రత్తి కొనుగోళ్లలో ఈక్రాప్ నిబంధనలు సడలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, నవంబర్ 21: సీసీఐ ప్రత్తి కొనుగోళ్లలో ఈక్రాప్ నిబంధనల వల్ల రైతులు, కౌలు రైతులు పూర్తి పంట దిగుబడి నమోదు కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని నందిగామ మార్కెట్ కమిటీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు (బుజ్జి) పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ద్వారా మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజశేఖర్‌ను కలిసి సీసీఐ ప్రత్తి కొనుగోళ్లలో రైతులు, రైతు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈక్రాప్‌లో రైతుల ప్రత్తి ఉత్పత్తి మొత్తం నమోదు కాకపోవడం వల్ల అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తూ దీనికి సంబంధించి నిబంధనలు సడలించడం గానీ లేక గత విధానం ద్వారా కొనుగోళ్లు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదే విధంగా నందిగామ మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, సుబాబుల్ రైతు బకాయిలను త్వరగా చెల్లించే ఏర్పాట్లు చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ఆయన సానుకూలంగా స్పందించారని ఎఎంసి చైర్మన్ బుజ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

వరకట్నం వేధింపులకు వివాహిత బలి
కూచిపూడి, నవంబర్ 21: వరకట్నం వేధింపులకు వివాహిత మృతి చెందిన సంఘటన మండల కేంద్రం మొవ్వ డా. బీఆర్ అంబేద్కర్‌నగర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు అత్తమామల కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తుండగా, అరుణ్ కుమార్ తల్లిదండ్రులు, బంధువులు మోహిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని చెబుతున్నారు. దీనిపై అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు కూచిపూడి పోలీసు స్టేషన్‌లో మంగళవారం విలేఖర్లతో మాట్లాడుతూ మొవ్వ గ్రామానికి చెందిన మదిరి పాములయ్య కుమారుడు అరుణకుమార్‌కు, గుడివాడ మండలం కలువపాములకు చెందిన ఇంటి జయరాజు, నాగమణిల 3వ కుమార్తె మోహినితో ఈ ఏడాది జూన్ 9న వివాహమైంది. వివాహం సందర్భంగా జయరాజు దంపతులు అరుణకుమార్‌కు రూ.45వేల నగదు, బంగారపు ఉంగరాన్ని కట్నంగా ఇచ్చారు. వివాహమైన నాటి నుండే మోహినిని అత్తమామలు తరచుగా కట్నం చాలలేదంటూ వేధింపులకు గురి చేశారు. అప్పుడప్పుడు మామ పాములయ్య, అత్త నాగమణి మోహినిపై దాడి కూడా చేసినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మోహినికి అత్తమామలతో వివాదం జరిగింది. తీవ్ర మనస్థాపానికి గురైన మోహిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు అత్తమామలు పేర్కొంటున్నారు. పోలీసులు కేసు తారుమారు చేస్తారేమోనన్న అనుమానంతో కలువపాములు నుండి మోహిని బంధువులు పెద్ద ఎత్తున మొవ్వ గ్రామానికి తరలి వచ్చి తమ కుమార్తె మృతిపై న్యాయమైన దర్యాప్తు చేసి నిందితులను శిక్షించే వరకు ఊరుకునేది లేదని, తమకు న్యాయం చేసే వరకు శవాన్ని పోస్టుమార్టం చేసేందుకు ఒప్పుకోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న చల్లపల్లి సీఐ బి జనార్ధనరావు సంఘటనా స్థలాన్ని సందర్శించి సమాచారాన్ని అవనిగడ్డ డీఎస్పీ పోతురాజుకు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మోహిని మృతికి కారకులైన వారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమన్నారు. నిందితులపై సెక్షన్ 304బీ ప్రకారం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని మొవ్వ తహశీల్దార్ బీ రామానాయక్ శవపంచనామ జరిపి నివేదిక అందచేశారు. ఇన్‌ఛార్జి ఎస్‌ఐ కెవి సత్యనారాయణ, హెచ్‌సీ వి వెంకటేశ్వరరావు దర్యాప్తు చేస్తున్నారు.