కృష్ణ

రాష్ట్రంలో గుడివాడ మున్సిపాలిటీకి మొదటి స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, డిసెంబర్ 5: రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లో ప్రజలకందుతున్న సేవలకు గాను గుడివాడ మున్సిపాలిటీకి మొదటి స్థానం లభించిందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకవర్గం, అధికార యంత్రాంగం, సిబ్బంది సమష్టి కృషివల్లే ఫలితం లభించిందన్నారు. త్వరలో గుడివాడను ప్లాస్టిక్ రహిత పట్టణంగా, క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడగా తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ మొదటి స్థానంలో నిలవడంతో పౌరసేవల విషయంలో అధికారులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. డిజిటల్ కీ లేకపోవడం వల్ల ఇటీవల ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయని, 185 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, కీ వచ్చిన గంటలోనే వాటిని పరిష్కరించామన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు కిలిమి వెంకటరెడ్డి, పొట్లూరి కృష్ణారావు, వసంతవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.