కృష్ణ

పెన్షన్ మంజూరులో అక్రమాలను అరికట్టేందుకు నిపుణులతో కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 5: పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ల మంజూరులో అక్రమాలు నిరోధించడానికి నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎకౌంట్స్ అండ్ జనరల్ కార్యాలయ సీనియర్ ఆడిటింగ్ అధికారి ఎంఎ మునీర్‌ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పెన్షన్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అదాలత్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. తొలిగా కృష్ణాజిల్లాలో ఈ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలి రోజైన మంగళవారం పెన్షన్ ఆదాలత్ నిర్వహించగా బుధవారం జీపీఎఫ్ అదాలత్ నిర్వహించి ఆయా అంశాల్లో నెలకొన్న సమస్యల పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్‌ల మంజూరులో అక్రమాలను అరికట్టేందుకు త్వరలోనే నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ బృందం 13 జిల్లాల్లోని అన్ని సబ్ ట్రజరీ కార్యాలయా పరిధిలో నూరుశాతం పెన్షన్లు తనిఖీ చేయిస్తామన్నారు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ ఫారాలను సమగ్ర సమాచారంతో పూర్తిచేసి ఎకౌంట్స్ జనరల్ కార్యాలయానికి పంపాలన్నారు. పెన్షన్ ప్రతిపాదనలు పంపే ఉద్యోగి సర్వీస్ పుస్తకం అప్‌డేట్ చేసి సంబంధిత పత్రాలు జత చేయాల్సి ఉంటుందన్నారు. పెన్షన్ చెల్లింపు చేయాల్సిన ప్రదేశాన్ని ఫారంలో సరిగ్గా పేర్కొనాలని సూచించారు. మోడల్ ఆన్‌లైన్ పెన్షన్ ఫామ్‌ను డీడీఓలు అందరికీ సర్క్యులేట్ చేయాలని ట్రజరీ అధికారులను ఆదేశించారు. జీపీఎఫ్ చందాదారుల మిస్సింగ్ క్రెడిట్స్‌కు సంబంధించి కొంత మంది ఉద్యోగులు అక్కడిక్కడే పరిష్కారం పొందారు. ఈ సమావేశంలో ఎకౌంట్స్ జనరల్ కార్యాలయ ఆడిట్ అధికారులు రమేష్ శంకర్, సరోజ, శ్రీనివాసరావు, అనూరాధ, జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు వి నాగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.