కృష్ణ

లోక్ ఆదాలత్‌ల ద్వారా పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 7: జిల్లాలోని పలు న్యాయస్థానాల్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ ఆదాలత్‌ల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్ ఆదాలత్‌ల నిర్వహణలో ఇప్పటికే జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఈ నెల 9వతేదీన కూడా జిల్లాలో లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంతో పాటు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో లోక్ ఆదాలత్‌లు నిర్వహించి పలు రకాల పెండింగ్ కేసులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 55వేల 500 పెండింగ్ కేసులు ఉండగా లోక్ ఆదాలత్‌లో పరిష్కరించేందుకు 8వేలు గుర్తించామన్నారు. ప్రీలిటిగేషన్ కేసులను కూడా పరిష్కరించనున్నట్లు తెలిపారు. విజయవాడలో ఎనిమిది స్పెషల్ బెంచ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలలో 4వేల 111 కేసులు, ఏప్రిల్ నెలలో 2వేల 733 కేసులు, జులై నెలలో 3వేల 586 కేసులు, సెప్టెంబర్‌లో 2వేల 652 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్, న్యాయమూర్తులు డా. ఎస్ రజనీ, ఎస్‌ఎస్‌ఎస్ జయరాజు పాల్గొన్నారు.

వాయుగుండం హెచ్చరికతో ఆందోళనలో రైతులు
కూచిపూడి, డిసెంబర్ 7: వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న రైతన్నలకు గోరుచుట్టు పై రోకటిపోటు చందాన వరి కట్టవేతలు, కుప్పల కూలి ధర రూ. 3వేల నుండి రెట్టింపుగా ఆరు వేలు కావటంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. అదే సమయం వరికోత యంత్రాలు తగినన్ని అందుబాటులో లేకపోవటంతో రైతుల బాధ వర్ణాతీతంగా మారింది. యాంత్రిక వ్యవసాయంపై రైతులు చైతన్యవంతులు కాకపోవటంతో ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో పంట రక్షణ రైతులకు కత్తిమీద సాముగా మారిందని మొవ్వ వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. గత దశాబ్దకాలంగా ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది మొవ్వ మండలంలో 11,207 హెక్టార్లలో వరిసాగు అయ్యింది. ముందుగా విత్తిన వరి పంటతోపాటు ఆలశ్యంగా విత్తిన రకాలు సైతం ఏవుగా పెరిగి కోతలకు సిద్ధమయ్యాయి. మండలంలో 70 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. ఇందులో 50 శాతం కుప్పలు పడ్డాయి. కూలీల డిమాండ్ కారణంగా ఆలస్యం చేసిన రైతుల పాలిట వాయుగుండం హెచ్చరికలు శాపంగా మారాయి. ఏదిఏమైనా వాయుగుండెం ప్రభావం చూపకుండా ఉండాలంటూ రైతులు దేవుళ్లను వేడుకుంటున్నారు. వారి వేడుకోలు సఫలం కావాలని ఆశిద్దాం.