కృష్ణ

తల్లీ దుర్గమ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 10: తల్లీ దుర్గమ్మా మాకు నీవే రక్ష.. నీవే అండ అంటూ భవానీదీక్షాధారులు భక్తితో దీక్ష విరమణ చేశారు. తొలిరోజు ఆదివారం ఉదయం దుర్గమ్మ సన్నిధిలోని శ్రీ మల్లిఖార్జున మహామండపం వద్ద ఏర్పాటు చేసిన హోమగుండంలో అర్చకులు పూజా సామగ్రి వేసి భవానీ దీక్షల విరమణ ప్రారంభించారు. హోమగుండం వద్ద ఆలయ స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్, ఋత్వికులు కమిటీ చైర్మన్ వై గౌరంగబాబు, ఇవో ఎ సూర్యకుమారి, ధర్మకర్తలు వెలగపూడి శంకరాబాబు, పద్మశేఖర్, సాంబశివరావు, సహాయ ఇవో శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, పర్యవేక్షణాధికారి ఎన్ రమేష్, చేత భక్తితో ప్రత్యేక పూజలను చేయించి సమస్త దేవతలను ఆవాహనం చేశారు. ఈ సందర్భంగా మంటపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్ఠించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన తర్వాత భవానీలు దీక్షాల విరమణ ప్రారంభం అయంది. ఉదయం నుంచే వందలాది మంది భవానీలు జై దుర్గా భవానీకి జై అంటూ హోమగుండంలో పూజా సామగ్రి వేసి గురుభవానీల ఆధ్వర్యంలో దీక్షామాలను తీయించుకున్నారు. శనివారం నాడే నగరానికి చేరుకున్న భవానీలు పవిత్ర స్నానాలు ఆచరించి గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేసి వాటిని శిరస్సుపై ధరించి గిరిప్రదక్షణ చేశారు. తర్వాత కెనాల్‌రోడ్ వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోకి ప్రవేశించి కొండపైకి చేరుకొని దుర్గమ్మను దర్శించుకున్నారు. ఉదయం సుమారు 6-45 గంటల నుండి భవానీలు, భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అందరినీ ముఖమండపం దర్శనం వరకే అనుమతించారు. అర్జున వీధిలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరించిన భవానీలు ప్రసాదాలను కొనుగోలు చేశారు.