కృష్ణ

పోలవరం నిర్మాణంపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, జనవరి 10: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువైన పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వెంటనే స్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్ డిమాండ్ చేశారు. పెనుగంచిప్రోలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బిక్కి నర్శింహరావు గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలోనే పోలవరం నిర్మాణాన్ని విభజన చట్టంలో చేర్చడం జరిగిందని, దాని నిర్మాణంపై రాష్ట్ర ఫ్రభుత్వం పలు అవకతవకలకు పాల్పడిందని పలు ఆరోపణలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాపై పోరాడకుండా ప్రత్యేక ప్యాకేజీ కోసం అర్రులు చాచారని, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఇది మంచి పరిణామం కాదని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాదల వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

పీఆర్ పునర్‌వ్యవస్థీకరణలో ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి
జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 10: పంచాయతీ రాజ్ వ్యవస్థ పునవ్యవస్థీకరణలో అన్ని క్యాడర్ల ఉద్యోగులకు న్యాయం చేకూర్చాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లారుూస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పీవీఎస్ నాగేశ్వరరావు, కార్యదర్శి చలసాని అశోక్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం జిల్లా యూనిట్ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థల్లోని పర్యవేక్షకుల పోస్టులను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మార్పు చేసి వారికి గెజిటెడ్ హోదా కల్పించాలని, ఎంజీఎస్‌ఆర్, జీఎస్‌ఆర్ కార్యక్రమం కింద మండలానికి ఒక సీనియర్, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసి మండల పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. గ్రామీణ అభివృద్ధి శాఖల విలీనంలో భాగంగా జిల్లా స్థాయిలోని డ్వామా కార్యాలయాలను జిల్లా పరిషత్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయిలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ పరిపాలనను ఒకే తాటి కింద తీసుకురావడం ద్వారా పంచాయతీ సంస్థల పరిపాలనా వ్యవస్థను పటిష్టపర్చాలన్నారు. మండల స్థాయిలో ఎపీఒ, ఎపీడీ పోస్టులను పంచాయతీ రాజ్ సంస్థల సీనియర్ అసిస్టెంట్‌లు, సూపరింటెండెంట్‌లతో భర్తీ చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో పని చేస్తున్న రికార్డు, ల్యాబ్, లైబ్రరీ అసిస్టెంట్‌లను వారి అర్హత మేరకు గ్రేడ్ 2, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని, గ్రామీణాభివృద్ధి శాఖలను అసిస్టెంట్ డైరెక్టర్, ఆ పైస్థాయి పోస్టులను ఎంపీడీఒ పోస్టులతో భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా చిల్లకల్లు సమితి యూనిట్ అధ్యక్షుడు శ్రీనివాసబాబు, కార్యదర్శి డీ రాజులు జిల్లా నాయకులను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షుడు వివిఎస్ ప్రసాదరావు, కోశాధికారి సాంబశివరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్‌లు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు, జిల్లాలోని అన్ని మండల యూనిట్‌ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.