కృష్ణ

ప్రాథమిక హక్కులపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 10: ప్రాథమిక హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వరలక్ష్మి అన్నారు. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఎస్టీ బాలికల వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జడ్జి వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని మసులుకోవాలని సూచించారు. అదేవిధంగా చట్టాలు, నైతిక విలువలు, బాలల హక్కులపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం బాలికల వసతి గృహంలో భోజనశాల, వంటగది, తరగతి గదులు, రీడింగ్ రూములను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె శైలజ, వార్డెన్ బి దీప, మైలవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలి
బంటుమిల్లి, డిసెంబర్ 10: రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ ఇతరుల హక్కులకు ఇబ్బంది కలిగించకుండా ప్రతి మనిషి నడుచుకోవాలని బంటుమిల్లి సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ విజయచందర్ అన్నారు. ఆదివారం ఉదయం బంటుమిల్లి పంచాయతీ ప్రాంగణంలో అంతర్జాతీయ మానవ హక్కల దినోత్సవం సందర్భంగా జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకూడదన్నారు. మనలను ప్రతి ఒక్కరూ అనుసరించేలా మన జీవన విధానం ఉండాలన్నారు. కులం, మతం చేసే పనులను భట్టి మన పూర్వీకులు నిర్ణయించారన్నారు. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ఏ దేశంలో లేదన్నారు. అనంతరం వివిధ మానవ హక్కుల ఉల్లంఘనలు తదితర అంశాలపై వివరించారు. తమ్మన సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుజ్ఞానం అశోక్ కుమార్, పళ్లెం వీర వెంకటేశ్వరరావు, పరసా సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్‌ఐ డి దుర్గా మహేశ్వరరావు, కోర్టు సిబ్బంది అపరంజి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గోపూజలు
అవనిగడ్డ, డిసెంబర్ 10: భానుసప్తమి పర్వదినం సందర్భంగా స్థానిక శ్రీ రాజశేఖర స్వామి, శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం గోపూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ వేణుగోపాలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్‌లు సింహాద్రి రామనాదబాబు, యాసం శ్రీరాములు ఏర్పాట్లను పర్యవేక్షించారు.