కృష్ణ

సమర్థతకు పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 11: సమర్థతకు పట్టం కడతామని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. అద్భుతమైన పనితీరు ప్రదర్శించి జిల్లాను అన్నింటా ముందుంచిన అధికారులను పసిడి పతకాలతో సత్కరించడం జరుగుతుందన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ పసిడి పతకాలతో సత్కరించారు. 48శాతం వృద్ధి రేటుతో వ్యవసాయ రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన జాయింట్ కలెక్టర్ పిడుగు బాబూరావుకు, ఈ-ఆఫీస్ అమలు, ఉద్యోగుల మాష్టర్ డేటా అప్‌లోడ్, మీకోసం తదితర అంశాల్లో ఉత్తమ ప్రగతి సాధించిన జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్యకు, బీసీ, కాపు కార్పొరేషన్ రుణాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి పెంటోజీరావుకు, పనుల వారీ అంశాలను ఏడు రిజిష్టర్లు సకాలంలో అప్‌డేటా చేసినందుకు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి కె శ్రీదేవికి, ఒడీఎఫ్ సాధనలో ప్రతిభ కనబర్చిన జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఇ కె శ్రీనివాసరావుతో పాటు ఎపీఎస్‌పీడీసీఎల్ స్‌ఇ ఎన్ వెంకటేశ్వర్లు, పిషరీస్ జెడీ ఎండీ యాకూబ్ బాషా, మైనార్టీ కార్పొరేషన్ ఇడీ కృపావరం, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఈశ్వరరావు, టిడ్‌కో ఇఇ చిన్నోడు, జగ్గయ్యపేట తహశీల్దార్ నరసింహరావు, కెడీసీసీ డెప్యూటీ జనరల్ మేనేజర్ నిరంజనీలకు కలెక్టర్ పసిడి పతకాలను అందజేశారు.
రానున్న రోజుల్లో మండల స్థాయి అధికారులకు కూడా పసిడి పతకాలు అందించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.