కృష్ణ

జై దుర్గ భవానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 11: జయ దుర్గ భవానీ.... జయజయ భవానీ.. అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భవానీ దీక్షాధారులు ఉదయం అమ్మవారి సన్నిధిలో దీక్షలు విరమించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భవానీ దీక్షల విరమణ రెండోరోజైన సోమవారం వేకువజా మున నగరానికి చేరుకున్న భవానీలు భక్తి ప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకొని, తర్వాత ఇరుముడులను సమర్పించుకున్నారు. ఆదివారం రాత్రి వివి ధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న భవానీలు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత వేకువజామునే దుర్గాఘాట్‌లో పవిత్ర స్నానాలు ఆచరించారు. గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులకు ప్రత్యేక పూజలు చేసి వాటిని శిరస్సుపై ధరించారు. భవానీలు బృందాలుగా గురుభవానీల ఆధ్వర్యంలో కాపాడమ్మ.. రక్షించమ్మ.. నీవే రక్ష.. అంటూ సుమారు 3కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేశారు. కెనాల్ రోడ్ వద్ద వినాయకుడి గుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోకి ప్రవేశించి కొండపైకి చేరుకున్నారు. అమ్మవారిని ముఖమండప దర్శనం చేసుకున్నారు. తర్వాత మెట్ల మార్గంలో కిందికి చేరుకొని శ్రీ మల్లిఖార్జున మహామండపం సెంటర్‌లో రెండుచోట్ల ఏర్పాటు చేసిన హోమగుండాల్లో ఇరుముడిలోని పూజా సామగ్రి వేయించి, అక్కడ ఉన్న గురుభవానీల ఆధ్వర్యంలో మాలలు తీయించుకున్నారు. అర్జున వీధిలో దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి నిత్యాన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. తర్వాత కనకదుర్గనగర్‌లోని దేవస్ధానం ప్రసాదాల కౌంటర్‌లలో అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేశారు. కొందరు భవానీలు అరండల్ సత్రం, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న ఏర్పాటు చేసిన కేశఖండనశాలల్లో తలనీలాలు సమర్పించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆది, సోమ రెండు రోజులకు కలిసి సుమారు లక్ష మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా. భవానీలు, భక్తులకు కొరత లేకుండా లడ్డూలను విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. కాగా, శ్రీ కనకదుర్గమ్మ వారి సప్తాహ అఖండనామ స్మరణ వేదిక ప్రాంగణంలో సోమవారం సాయంత్రం శ్రీ కనకదుర్గ నృత్య మందిర్ విద్యార్థులు నృత్య రూపకం ప్రదర్శించారు.